మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
X
పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూశారు. గుండె సంబంధించిన వ్యాధితో భాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో ఓ ప్రవేటు ఆసుపత్రిలో ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. రాజమల్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1994 ఎన్నికల్లో టీడీపీ తరపున పెద్దపల్లి శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. అంతకు ముందు ఆయన సుల్తానాబాద్ పీఏసీఎస్ ఛైర్మన్‌గా పని చేశారు. ఇక మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు మరణం పట్ల కాంగ్రెస్ నేతలు సంతాపం తెలుపుతున్నారు. ఆయన అంతక్రియలు రేపు జరిగే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత 1989లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 1994లో మళ్లీ టీడీపీ తరపున పోటీ చేసి దాదాపు 40 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2018లో టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. 2023లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యే విజయ రమణారావు గెలుపు కోసం కృషి చేశారు.