పవన్ ఇరిటేషన్ స్టార్..బాబు ఇమిటేషన్ స్టార్..మంత్రి రోజా
X
ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై ఏపీ మంత్రి రోజా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హాయ్ ఏపీ.. బైబై బీపీ..వన్స్ అగైన్ వైఎస్ఆర్సీపీ అంటూ సరికొత్త నినాదాన్ని తీసుకువచ్చారు రోజా. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాల వేసిన రోజా ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి జగనన్న ప్రభుత్వమే అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. బాబు, పవన్ లపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
"రికార్డులు సృష్టించాలన్నా..రికార్డులు బ్రేక్ చేయాలన్నా జగన్‌కే సాధ్యం. ఇరిటేషన్ స్టార్ట్ పవన్ కళ్యాణ్, ఇమిటేషన్ స్టార్ చంద్రబాబులు, ఇన్స్పిరేషన్ స్టార్ జగనన్న కాలు మీద ఉన్న వెంట్రుక కూడా పీకలేరు. ప్రజలందరూ అంటున్నారు మళ్లీ జగనే సీఎం అవుతారని. సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబంలో ఉన్న అర్హులకు సంక్షేమ పథకాలను అందింస్తున్నాము. అంతే కాదు ఎమ్మెల్యేలు, మంత్రులు గడపగడపకు వెళ్లి ఆ గ్రామాలు, వార్డులను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా ఇంకా ఎవరైనా అర్హత ఉండి కూడా లబ్దిపొందకుంటే వారిని కూడా జల్లెడ పట్టి గుర్తించి జగనన్న సురక్షా ద్వారా న్యాయం చేయాలని జగన్ పిలుపునిచ్చారు. గొప్ప మనసున్న నాయకుడు జగన్. ప్రజలు మళ్లీ ఆయన్నే సీఎం చేస్తారు.
చిత్తూరు జిల్లా పాడి రైతుల జీవితాల్లో జగనన్న వెలుగు నింపుతున్నారు. అలాంటిది చిత్తూరు జిల్లాలో పుట్టిన చంద్రబాబు 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసి,
ఆయన సొంత డైరీ హెరిటేజ్‌ను డెవలప్ చేసుకున్నారు కానీ పాడి రైతుల జీవితాలను అంధకారం చేశారు. కానీ జగన్ ప్రజల కోసం చిత్తూరు జిల్లాని అభివృద్ధి చేస్తున్నారన్నారు. పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. జగనన్నకు జిల్లా వాసులు తరఫున నా కృతజ్ఞతలు" అని రోజా తెలిపారు.