ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం.. ప్రధానికి పవన్ లేఖ
X
ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల నిర్మాణం పేరిట భారీ కుంభకోణం జరిగిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. దీనిపై సీబీఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని చెప్తూ.. ప్రధాని మోదీకి పవన్.. 5 పేజీల లేఖ రాశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలనలో భూసేకరణ పేరిట రూ. 32,141 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగిందని అన్నారు.
ఇండ్ల పట్టాలు, నిర్మాణంపై ప్రభుత్వం భిన్న ప్రకటనలు చేస్తుందని విమర్శించారు. ఈ అంశంపై సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటికి వస్తాయని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు భూ సేకరణ విషయంలో కీలకంగా వ్యవహరించారు. గతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా పూర్తిగా లబ్ధిదారులకు ఇవ్వలేదని పవన్ ఆరోపించారు. 6.68 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తయితే 86,984 మంది లబ్ధిదారులకే అందించారని లేఖలో చెప్పుకొచ్చారు.