తెలంగాణలో వారాహి.. జనసేన లక్ష్యం అదేనా..!
X
తెలంగాణలో ఉద్యమంలో అమరులైన వాళ్ల ఆకాంక్షను నెరవేర్చడమే జనసేన పార్టీ లక్ష్యం అన్నారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో తెలంగాణ నాయకులతో మాట్లాడిన ఆయన.. 26 నియోజకవర్గాలకు ఇంచార్జ్ లను నియమించారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో జనసేన బలమైన పార్టీగా ఎదుగుతుందని ఆకాంక్షించారు. అమర వీరుల ఆకాంక్ష.. నీళ్లు, నిధులు, నియామకాలని.. ప్రస్తుతం అవి అందకపోవడం, రాష్ట్రం సాధించి నిష్ప్రయోజనం అయిదని పవన్ అన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ లో ఎన్నికలు జరుగొచ్చని.. అందుకే వారాహి యాత్ర తెలంగాణలో కూడా ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ లెక్కన తెలంగాణలో కూడా జనసేన పోటీ చేయనుంది. అందుకుగానూ 26 నియోజక వర్గాల్లో బాధ్యలను నియమించింది. ఈ కార్యక్రమంలో మైత్రి మూవీస్ వై.రవిశంకర్, డీవీవీ ఎంటర్ టైన్మంట్ డీవీవీ దానయ్య, మెగా సూర్యా ప్రొడక్షన్ ఏఎం రత్నం, ఎస్వీసీసీ బీవీఎస్ఎన్ ప్రసాద్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ శ్రీ వివేక్ కూచిభొట్లతోపాటు, దర్శకుడు హరీష్ శంకర్‌లు పాల్గొన్నారు.
https://twitter.com/JanaSenaParty/status/1668251328467079170?s=20