Pawan Kalyan : రూ.10 కోట్లు విరాళమిచ్చిన జనసేనాని పవన్
X
రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని, తమ కూటమి తప్పక అధికారంలోకి వస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా నేతలతో సమావేశమైన ఆయన.. ఎన్నికల నేపథ్యంలో పార్టీ నిధికి తన వంతు సాయంగా రూ.10 కోట్లు విరాళమించ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్.. వ్యక్తిగత గెలుపు కోసం కాదు, సమష్టి గెలుపు కోసమే తన వ్యూహాలు, అడుగులు ఉంటాయని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి నుంచి తమ బలాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. కూటమిని గెలుపు దిశగా తీసుకెళ్లేందుకు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. జనసేన కోసం తపించి పనిచేసిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పించే బాధ్యత తనదేనని పార్టీ నేతలకు పవన్ భరోసానిచ్చారు. రాష్ట్రానికి సుస్థిర పాలన అవసరమని, అప్పుడే అభివృద్ధి సాధ్యమని అన్నారు. అలాంటి సుస్థిర పాలన తమ కూటిమి అందించగలదని చెప్పుకొచ్చారు.