పవన్ అంటే ఇంత పిచ్చి అభిమానమా...వీడియో వైరల్
X
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతిలో పర్యటించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న జనసేన నాయకుడిని చెంపదెబ్బకొట్టిన శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌పై జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి పవన్ ఫిర్యాదు చేశారు. తొలుత గన్నవరం విమానాశ్రయం నుంచి పవన్ రేణిగుంట వచ్చారు. అక్కడి నుంచి తిరుపతికి చేరుకున్నారు.. జనసేన కార్యకర్తలతో కలిసి భారీగా ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి అక్కడ వినతిపత్రం అందజేశారు. పవన్ తిరుపతికి రావడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు. ర్యాలీ సందర్భంగా ఓ జనసేన అభిమాని అత్యూత్సాహం ప్రదర్శించాడు.
క్రేన్‌కు వేళ్లాడుతూ వచ్చిన ఓ అభిమాని పవన్‌కు శాలువా కప్పి, పూల దండ అందించాడు.కారులో నిలుచుని ఉన్న పవన్ అతడిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. నవ్వుతూ ఆ పలకరించాడు. ఈ సమయంలో జనసేన అభిమానులు కేరింతలు కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇటీవల శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు కొట్టే సాయిపై సీఐ అంజూయాదవ్ చేయిచేసుకున్న ఘటనపై వివాదం చెలరేగింది. సీఐ తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పవన్ కల్యాణ్, జనసేన సైనికులు తీవ్రంగా మండిపడ్డారు. ముందుగా ప్రకటించిన విధంగానే జిల్లా ఎస్పీని కలిసి సీఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. పవన్ రాకతో తిరుపతిలో కోలాహలం నెలకొంది.