Home > ఆంధ్రప్రదేశ్ > పవన్ కల్యాణ్‌ను అడ్డుకున్న పోలీసులు.. లాఠీ లేచింది..

పవన్ కల్యాణ్‌ను అడ్డుకున్న పోలీసులు.. లాఠీ లేచింది..

పవన్ కల్యాణ్‌ను అడ్డుకున్న పోలీసులు.. లాఠీ లేచింది..
X

విజయవాడ వెళ్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆయన రాష్ట్రంలోకి వస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందంటూ ముందుకుసాగనివ్వలేదు. విమానంలో విజయవాడ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్ పోర్టు అధికారులు అనుమతి ఇవ్వకపోవంతో పవన్ రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎన్టీఆర్‌ జిల్లా గరికపాడు వద్ద అడ్డుకున్నారు. కారణం చెప్పకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని జనసేన నేతలు ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ‘‘ ఏపీలోకి రావాలంటే వీసా, పాస్ పోర్టు కావాలేమో’’ అని పవన్ మండిపడ్డారు. పోలసులు పెట్టిన బ్యారికేడ్లను జనసేన కార్యకర్తలు తొలగిస్తున్నారు. దీంతో దారిలో గొడవలు జరుగుతున్నాయి. జగ్గయ్యపేట పోలీసులు పవన్‌ను అరెస్ట్ చేయడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.

Updated : 9 Sep 2023 5:14 PM GMT
Tags:    
Next Story
Share it
Top