అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ..
X
జనసేన అధినేత ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఎన్డీయే సమావేశం కోసం ఢిల్లీకి వెళ్లిన పవన్ గురువారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపు 25 నిమిల పాటు వీరి భేటీ కొనసాగింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వర్తమాన రాజకీయ అంశాలతోపాటు రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి అనుసరించాల్సిన ప్రణాళికపై చర్చించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు నిర్మాణాత్మక, నిర్ణయాత్మక, సుసంపన్నమైన భవిష్యత్ అందించేందుకు అమిత్ షాతో జరిపిన చర్చలు ఉపయోగపడతాయని జనసేన ట్వీట్ చేసింది. ఈ సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు. అంతకుముందు బుధవారం ఉదయం ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ మురళీధరరావును పవన్ కల్యాణ్ కలిశారు. గురువారం కూడా ఢిల్లీలోనే వుండి.. మరికొందరు పెద్దలతో పవన్ కళ్యాణ్ సమావేశమవుతారని సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.