వారాహితో ప్రజల్లోకి పవన్ కల్యాణ్
X
ఎన్నికల ప్రచారం కోసం స్వయంగా తయారు చేయించిన వారాహితో పర్యటనకు పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు. త్వరలో భయ గోదావరి జిల్లాల్లో జనసేనాని పర్యటించనున్నారు. ఈ పర్యటనను వారాహి వాహనంతో చేసేందుకు సిద్ధమయ్యారు.ఈ మేరకు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటనపై పార్టీ నేతలతో నాదెండ్ల మనోహర్ సమావేశం అయ్యారు. వారితో రూట్‌మ్యాప్‌పై చర్చించారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దిశానిర్దేశం చేశారు. పవన్ యాత్రకు ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. త్వరలో పవన్ యాత్ర తేదీలు ప్రకటించనున్నట్లు తెలిపారు.
గత ఏడాది దసరా నుంచే పవన్ కల్యాణ్ వారాహితో రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయాలని నిర్ణయించారు. ముందుగా ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించాలని భావించారు. కానీ పవన్ యాత్ర వాయిదా పడుతూ వస్తోంది. వారాహి పూజలు అనంతరం... తొలి సారిగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు పవన్ ప్రయాణించారు.తర్వాత వారాహిని బయటకు తీసింది లేదు. ఇప్పుడు ఎన్నికల్లు దగ్గరపడుతున్న సమయంలో వారాహితో యాత్రకు పవన్ సిద్దమయ్యారు.