వచ్చే ఎన్నికల్లో టీడీపీ..జనసేన.. బీజేపీ కలిసి పోటీ : పవన్
X
ఏపీలో పొత్తులపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉందని చెప్పారు. జగన్ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు అందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. కూటమిలో ముఖ్యమంత్రి ఎవరన్నది ఎన్నికల ఫలితాల్లో బలాబలాలను బట్టి నిర్ణయం ఉంటుందన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో విచ్చల విడిగా అవినీతి జరుగుతోందని పవన్ ఆరోపించారు. ఉద్యోగులకు 1న జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రోజుకి రూ.160 జీతం ఇచ్చి పెట్టుకున్న ప్రైవేటు వ్యక్తుల ద్వారా ప్రజల డేటా అంతా చోర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఆధార్, వేలిముద్రలు, ఐరిష్ డేటా అంతా తెలంగాణలో నిక్షిప్తం చేస్తున్నారన్నారు. ప్రజా వ్యతిరేకతను ఎదురించే వారు కావాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.
జనసేనకు ఏపీలో ప్రజల నుంచి మద్దతు వస్తోందని పవన్ అన్నారు. రాష్ట్రంలో ప్రజలు తీవ్ర నిరాశ నిస్పృహతో ఉన్నారని.. మీడియాలో కనిపిస్తున్న దానికి వాస్తవ పరిస్థితులకు పొంతన లేదని చెప్పారు. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదన్న జనసేనాని.. తనకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రం పది శాతం వడ్డీతో రుణాలు తీసుకొచ్చి రాష్ట్ర సొమ్మును ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు.
Pawan Kalyan sensational comments on party alliances in andhra pradesh,
Pawan Kalyan,TDP,Janasena,BJP,andhra pradesh,cm jagan,ycp,chandrababu naidu