జగన్, జగ్గు భాయ్, జగ్గు.. రేపు ఇంకేమంటానో నాకే తెలియదు.. పవన్
X
సీఎం జగన్ మందుబాబుల పొట్ట కొట్ట వేల కోట్ల దోచుకున్నారని జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ మండిపడ్డారు. వైసీపీ నేతలకు తనను తిట్టడం తప్ప మరో పనిలేదని, వాళ్లు ఎంత దిగజారి మాట్లాడితే తనూ అంతే దిగజారి మాట్లాడతానని హెచ్చరించారు. పవన్ విడత వారాహి విజయయాత్ర రెండు విడత ముగింపు సందర్భంగా శుక్రవారం తణుకులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. జగన్‌పై, ప్రభుత్వ వైఫర్యాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను ప్యాకేజీ స్టార్ అని నానా మాటలూ అనే జగన్, వైకాపా నేతలు జగన్‌ను తను జగ్గుభాయ్ అంటే ఎందుకంతగా గింజుకుంటున్నారని ప్రశ్నించారు. జంగన్ కొంపలు అంటించే రకమైతే తను గుండెలను మండించే రకమని చెప్పారు.
‘‘జగన్ గారు అని పిలవడం దగ్గర్నుంచి జాగ్గు భాయ్ అనేదాకా వచ్చాను. ఇక జగ్గు అంటాను, ఆ తర్వాతం మరింకేం అంటానో కాకే తెలియదు. జగన్ పాలనలో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. నిత్యావసరాల ధరలను విపరీతంగా పెంచారు. ఇల్లు లేని పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పి 9 వేల కోట్లు లాక్కుని మొండిచేయి చూపారు. అప్పులు తెచ్చి స్కాంలు చేశారు. జగన్ దోపిడీ చూసే జగ్గుభాయ్ అంటున్నా. అతనికి గళ్ల లుంగీ కట్టి, బుగ్గపై చుక్కపెట్టాలి. జగ్గుభాయ్ డిజిటల్ దొంగగా మారాడు’’ అని పవన్ మండిపడ్డారు. జగన్ 32 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల కొంపలు కూల్చారని, వారి సెస్ నిధులు కాజేశారని ఆరోపించారు. ‘‘నువ్వు వచ్చాక ఇంటి పన్ను 650 పెంచావు. నీ చెత్త పాలన వచ్చాకే చెత్తపై పన్ను వచ్చింది. మందుబాబుల పొట్టకొట్టి 30 వేల కోట్లు దండుకున్నావు’’ అని విమర్శించారు.