Home > ఆంధ్రప్రదేశ్ > ప్రాణాలకు తెగించి రాజకీయాల్లోకి వచ్చా...దేనికీ భయపడను :పవన్ కల్యాణ్

ప్రాణాలకు తెగించి రాజకీయాల్లోకి వచ్చా...దేనికీ భయపడను :పవన్ కల్యాణ్

ప్రాణాలకు తెగించి రాజకీయాల్లోకి వచ్చా...దేనికీ భయపడను :పవన్ కల్యాణ్
X

కేంద్రం సాయంతో ఒక రోజు జగన్‎ను ఆట ఆడిస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. త్వరలోనే అన్నీ బయటకు తీస్తామన్నారు. విశాఖలోని జగదాంబ సెంటర్‎లో నిర్వహించిన సభలో పవన్ మాట్లాడుతూ వైసీపీపై ఫైర్ అయ్యారు. " విశాఖ రుణం తీర్చుకోలేనిది. నేను ఎన్నికల్లో ఓడిపోయినా.. తర్వాత విశాఖ నాకు జీవం పోసింది. 2019 ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయొద్దని చెప్పినా ఎవరూ వినలేదు. రుషికొండను ఇష్టమొచ్చినట్లు తవ్వేశారు. ఎర్రమట్టి దిబ్బలు నాశనం చేశారు. వైసీపీ గూండాలకు, వైసీపీ వ్యవస్థకు భయపడకండి. మీకు ధైర్యం కావాలంటే జనసేన వైపు నిలబడండి. వలంటీర్లు మీద నాకు ద్వేషం లేదు. మీ చేత జగన్ తప్పులు చేయిస్తున్నారు. ప్రజల డేటా హైదరాబాద్ వెళ్లి పోతుంది.రాష్ట్రంలో 30 వేలపైగా మహిళలు మిస్సింగ్ ఆయారు. కేంద్ర నివేదికలు ఆధారంగానే నేను చెప్పాను. కొంత మంది వలంటీర్లు అక్రమాలకు, మోసాలకు పాల్పడ్డారు" అని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేల కోసం ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. "ప్రాణాలకు తెగించి రాజకీయాల్లోకి వచ్చా. దేనికీ భయపడను. వైసీపీని ఏపీ నుంచి తరిమికొట్టే వరకు విశాఖ జిల్లాను వైసీపీ విముక్త జిల్లాగా చేసే వరకు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది. విశాక జిల్లా సంఘ విద్రోహశక్తుల అడ్డాగా మారిందని స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, అరాచకాలు పెరిగిపోయాయి. విశాఖలోని ప్రభుత్వ ఆస్తులను రూ.25 వేల కోట్లకు తాకట్టు పెట్టారు. డబ్బేంటే జగన్ కు పిచ్చి వేల కోట్లు తింటున్నాడు. మద్యంపై రూ.30వేల కోట్లు ఆర్జించారు. వైసీపీకి మరో అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరు.జగన్‌కి మళ్లీ అధికారంలోకి రానివ్వకూడదు. ఓట్లు మాత్రం చీలనివ్వను.‌‌’’ అని పవన్ స్పష్టం చేశారు.

సీఎం జగన్ ఉదయం పథకం కింద డబ్బులు ఇచ్చి.. రాత్రి మద్యం ద్వారా డబ్బులు లాగేస్తున్నారు. ప్రశాంత విశాఖ... ఇప్పుడు వైసీపీ గూండా, రియల్ ఎస్టేట్ వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. గూండాలను అణిచివేసే ప్రభుత్వాన్ని నేను తీసుకు వస్తాను. ఎవరో వచ్చి ఇష్టానుసారం పాలిస్తామంటే చొక్కాలు పట్టుకుని నిలదీస్తాం. చూడటానికి పలుచగా ఉంటా.. నా ఒళ్లు మందం. గద్దర్ చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తు ఉన్నాయి.. కాలం ఎంతో విలువైంది’’ అని పవన్ చెప్పుకొచ్చారు.

Updated : 10 Aug 2023 9:48 PM IST
Tags:    
Next Story
Share it
Top