కన్నీరు పెట్టిన పవన్ కల్యాణ్ !
X
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగుతోంది. శనివారం కాకినాడలో పర్యటించారు. కాకినాడ అర్బన్, రూరల్ నియోజకవర్గాలకు సంబంధించి జనవాణి కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఓ దివ్యాంగుడి సమస్యలు వింటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
2021లో తన పెన్షన్ తీసివేశారని వికలాంగుడు శ్రీనివాస్ పవన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. ఎక్కువ కరెంట్ బిల్లు అని సాకు చూపించి ఉద్దేశపూర్వకంగా పింఛన్ తొలగించారని వాపోయాడు. 35 కేజీల రేషన్ బియ్యం వచ్చేదని, అది కూడా ఆపేసి ఇబ్బంది పెట్టారని తెలిపాడు. మళ్లీ బతిమాలితే ఇచ్చారని చెప్పాడు. శ్రీనివాస్ తల్లి కూడా తమ ఆవేదనను పవన్ ముందు చెప్పి బోరుమని విలపించింది. వారి బాధలు విని పవన్ కల్యాణ్ కన్నీళ్లు పెట్టారు.
వైసీపీ ప్రభుత్వం పెన్షన్ తీసివేస్తే... జనసేన పార్టీ బాధితులకు అండగా నిలిచి ఆదుకుందని వికలాంగుడు శ్రీనివాస్ తల్లి వెల్లడించింది. పవన్ కళ్యాణ్ తన జేబులోంచి పింఛన్ రూ.3000 ఇచ్చారని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. గత మూడు నెలల నుంచి పవన్ కళ్యాణ్ తన కుమారుడికి ఒకటో తేదీనే పెన్షన్ పంపిస్తున్న విషయాన్ని తెలిపారు.