Home > ఆంధ్రప్రదేశ్ > Pawan Kalyan : ఢిల్లీకి పవన్ కల్యాణ్.. చంద్రబాబుతో కలిసి బీజేపీ పెద్దలతో భేటీ..

Pawan Kalyan : ఢిల్లీకి పవన్ కల్యాణ్.. చంద్రబాబుతో కలిసి బీజేపీ పెద్దలతో భేటీ..

Pawan Kalyan : ఢిల్లీకి పవన్ కల్యాణ్.. చంద్రబాబుతో కలిసి బీజేపీ పెద్దలతో భేటీ..
X

ఏపీలో రాజకీయాలు రోజురోజుకి రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అధికార, ప్రతిపక్షపార్టీలు వ్యూహాలు సిద్దం చేసుకుంటున్నాయి. అయితే ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తులపై చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. అధికార పార్టీని దించడమే లక్ష్యంగా సీట్ల పంపకాలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే బీజేపీ పార్టీ పొత్తులపై తుది నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. దానిలో భాగంగా.. బీజేపీ హైకమాండ్‌ పిలుపు మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు పొత్తులపై చర్చించేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ కు కూడా బీజేపీ అధిష్టానం నుంచి పిలుపువచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పవన్ హుటాహుటిన హాస్తినకు బయలుదేరారు. అయితే, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరు కలిసి బీజేపీ పెద్దలలో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీ టూర్‌లో భాగంగా.. చంద్రబాబు, పవన్ కల్యాణ్.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, పొత్తులపై అమిత్‌షాతో చర్చించనున్నారు. ఇప్పటికీ పొత్తులపై ఏపీ బీజేపీ నేతలను ఆరా తీసారు అమిత్ షా. అంతేగాక పొత్తు అవసరాలు, పార్టీ నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే.. మూడు పార్టీలకు మేలు జరిగేలా పొత్తులు ఉండేలా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. వీటి కోసమే ఇరుపార్టీల అధినేతలు ఢిల్లీకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ భేటీలో కీలకంగా మూడు పార్టీల మధ్య సీట్ల పంపకాలు.. రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది.

ఎంపీలతో చంద్రబాబు భేటీ..

చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా టీడీపీ ఎంపీ ఇంటికి వెళ్లారు. అక్కడే టీడీపీ ఎంపీలతో భేటీ అయ్యారు. ఇటీవల వైసీపీ నుంచి బయటికి వచ్చిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా చంద్రబాబుతో కలిసి భేటీ అయ్యారు. ఎంపీ లావు త్వరలోనే టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

Updated : 8 Feb 2024 4:40 AM GMT
Tags:    
Next Story
Share it
Top