Home > ఆంధ్రప్రదేశ్ > పవన్ జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు

పవన్ జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు

పవన్ జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు
X

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్య టన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పవన్ పర్యటన సాగనుంది. తొలి రోజు భీమవరంలో వివిధ సమావేశాలలో పాల్గొంటారు. అనంతరం అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలలో సమావేశాలు ఉంటాయి. ఈ పర్యటనలో భాగంగా పార్టీ ముఖ్య నాయకులు, స్థానికంగా ప్రభావశీలురు, ముఖ్యులతో పవన్ భేటీ అవుతారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులతో కూడా ఆయన సమావేశమవుతారు. నియోజకవర్గాల స్థాయిలో ఇరు పార్టీల నాయకులు, శ్రేణుల మధ్య సుహృద్భాన వాతావరణం ఏర్పాటు, పొత్తు పలితాల ఫలాల లక్ష్యంగా భేటీలు జరుగుతాయి.

పవన్ కళ్యాణ్ పర్యటనలు మూడు దశలుగా నిర్వహించాలని నిర్ణయించారు. తొలిదశలో ముఖ్య నాయకులు, ప్రభావశీలురు, ముఖ్యులతో సమావేశాలు ఉంటాయి. రెండోసారి పర్యటనలో పార్టీ స్థానిక కమిటీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల సమావేశాలలో పాల్గొంటారు. మూడో దశలో ఎన్నికల ప్రచారం చేపడతారు. ఎన్నికల ప్రచారం చేపట్టినాటికి పవన్ మూడుమార్లు ఆయా ప్రాంతాలకు వెళ్ళే విధంగా పర్యటన షెడ్యూల్ సిద్ధం అవుతోంది. ఉభయ గోదావరి జిల్లాల పర్యటన అనంతరం ఇతర ప్రాంతాలకు సంబంధించిన పర్యటనలను ఖరారు చేసేందుకు పార్టీ ప్రచార కమిటీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ మేరకు పార్టీ ప్రచార కమిటీ ప్రకటన విడుదల చేసింది.

Updated : 10 Feb 2024 8:54 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top