Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన ..రెండు స్థానలపై క్లారిటీ
X
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటి చేసే ఇద్దరు అభ్యర్థులను ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాజోలుకు బొంతు రాజేశ్వర్, రాజానగరం బాలరామ కృష్ణను పోటీలో నిలపడానికి పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. టీడీపీ రెండు స్థానాలను ప్రకటించినందున తాము కుడా రెండు నియోజకవర్గాలో అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. తెలుగు దేశం పార్టీతో కలిసి వెళ్తుమని,ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందని.. సీట్ల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. మనం మూడో వంతు సీట్లను తీసుకోబోతున్నామని చెప్పారు. సీట్ల విషయంలో చంద్రబాబుపై ఒత్తిడి ఉంటుందని, అలాగే తనపై కూడా ఒత్తి ఉందని అన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో తాను రెండు సీట్లను ప్రకటిస్తున్నానని... రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని చెప్పారు.
ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని అన్నారు. సీఎం పదవి కోసం ఎవరూ ఆందోళన చెందొద్దని పవన్ చెప్పారు. జనసేన ఒంటరిగా పోటీ చేస్తే సీట్లు వస్తాయి కానీ, అధికారంలోకి రాలేమని అన్నారు. ఈ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వాన్ని జనసేన ఎంతో ఇరుకున పెట్టిందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలతో టీడీపీతో పొత్తు ముగియదని, భవిష్యత్తులో కూడా పొత్తు కొనసాగుతుందని తెలిపారు. ఇదే సమయంలో సీఎం జగన్ పై పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సొంత చెల్లెలినే వదిలిపెట్టని జగన్.. మనల్ని మాత్రం వదులుతాడా? అని ప్రశ్నించారు. జగన్ కు ఊరంతా శత్రువులే అని చెప్పారు. వైసీపీ నేతలకు కష్టాలు వస్తే తన వద్దకే రావాలని అన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబే అని లోకేశ్ మాట్లాడిన మాటలను తాను పట్టించుకోలేదని పవన్ చెప్పారు. చంద్రబాబు సీనియర్ నేత అని, సీఎంగా పని చేసిన వ్యక్తి అని.. అందుకే ఇలాంటివి జరుగుతుంటాయని అన్నారు. ఆ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.