Home > ఆంధ్రప్రదేశ్ > పవన్ కల్యాణ్‎కు పేర్నినాని కౌంటర్

పవన్ కల్యాణ్‎కు పేర్నినాని కౌంటర్

పవన్ కల్యాణ్‎కు పేర్నినాని కౌంటర్
X

జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ మాజీ మంత్రి పేర్నినానిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నా చెప్పులు పోయాయన్న పవన్ వ్యాఖ్యలకు పేర్నినాని కౌంటర్ ఇచ్చారు. ‘‘చెప్పులు పోతే ఎవరో ఒక ప్రొడ్యూసర్‌ కొనిస్తారు కానీ, ఆయన పార్టీకి గాజు గ్లాసు గుర్తు పోయింది.. ముందు దాన్ని వెతుక్కోమని చెప్పండి’’ అంటూ వ్యాఖ్యానించారు. చెప్పులు పోయిన మూడు రోజుల తర్వాత గుర్చొచ్చిందా అంటూ ఎద్దేవ చేశారు.

ఏం జరిగిందంటే..

గురువారం మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్‌ పై మాజీ మంత్రి పేర్నినాని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.ఈ క్రమంలో రెండు చెప్పులను చూపించారు. ‘‘చెప్పు చూపించి మక్కెలిరగ్గొడతానని పవన్ చెబుతున్నారు. పవన్ ఒక్కడికే కాదు మాకూ చెప్పులున్నాయి’’ అన్నారు. దీనిపై జనసేన నేతలు ఫైర్ అయ్యారు. తాజాగా శుక్రవారం పిఠాపురం సభలో పవన్ కల్యాణ్ దీనిపై పరోక్షంగా సెటైర్లు వేశారు. అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తే ఎవరో తన రెండు చెప్పులు కొట్టేశారన్నారు. ఎవరికైనా కనిపిస్తే చెప్పండంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. వైసీపీ పాలనలో చెప్పులకు కూడా రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. దీనిపై శనివారం పేర్నినాని మరోసారి కౌంటర్ ఇచ్చారు.

Updated : 17 Jun 2023 6:44 PM IST
Tags:    
Next Story
Share it
Top