Home > ఆంధ్రప్రదేశ్ > PF Withdrawal : 2 నిమిషాల్లొ పీఎఫ్ విత్ డ్రా.. ఎలాగో తెలుసా?

PF Withdrawal : 2 నిమిషాల్లొ పీఎఫ్ విత్ డ్రా.. ఎలాగో తెలుసా?

PF Withdrawal  : 2 నిమిషాల్లొ పీఎఫ్ విత్ డ్రా.. ఎలాగో తెలుసా?
X

ప్రావిడెంట్ ఫండ్.. ఉద్యోగ, శ్రామిక జీవులు సంపాదించే నిధులలో కొంత భాగాన్ని ఆదా చేయడానికి ప్రభుత్వం కల్పించిన అవకాశం. శ్రామిక ప్రజల ప్రాథమిక వేతనంలో కొంత భాగాన్ని ప్రతి నెలా పీఎఫ్ ఫండ్‌లో జమ చేస్తారు. ఖాతాదారులు డిపాజిట్ చేసిన మొత్తానికి వార్షిక ప్రాతిపదికన ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం వడ్డీ రేటును 8.15 శాతంగా నిర్ణయించింది. రిటైర్‌మెంట్ తర్వాతే ప్రావిడెంట్ ఫండ్ నుండి డబ్బును విత్‌డ్రా చేసుకోవడం మంచిది అయినప్పటికీ.. అయితే, కొన్నిసార్లు మీ అవసరాలను తీర్చుకోవడానికి మీరు మీ PF ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.

ఈపీఎఫ్ లో జమ అవుతున్న మొత్తం పదవీ విరమణ కోసం ఉద్దేశించింది అయినా.. చందాదారులు కొన్ని సందర్భాలలో పూర్తిగా లేదా పాక్షికంగా విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని సంస్థ కల్పించింది. విద్య, వైద్యం, వివాహం, ఇంటి నిర్మాణం వంటి పలు సందర్భాలలో ఈ ఫండ్ నుంచి పాక్షికంగా డబ్బు ఉపసంహరించుకోవచ్చు. పదవీ విరమణ తర్వాత ఉద్యోగుల ఆర్థిక భరోసా కోసం నిర్దేశించబడిన ఉద్యోగ భవిష్యత్ నిధి కాలక్రమేణా చాలా మార్పులు తీసుకొచ్చారు. ఉద్యోగంలో కొనసాగుతూనే అత్యవసర పరిస్థితుల్లో పీఎఫ్‌ అకౌంట్‌ నుండి డబ్బులు డ్రా చేసుకునే అవకాశాన్ని సంస్థ కల్పించింది. పీఎఫ్‌ ఖాతా నుండి కొంత డబ్బును విత్‌డ్రా చేసుకోవాలంటే కేవలం కొన్ని పరిస్థితులలో మాత్రమే అవకాశం ఉంటుంది. చదువు కోసం, అత్యవసర వైద్య పరిస్థితి, వివాహం కోసం, భూమి లేదా ఇల్లు నిర్మాణానికి లేదా కొనడానికి.

PF విత్‌డ్రాకి అవసరమైన పత్రాలు

1. యూనివర్సల్ ఖాతా సంఖ్య (UAN )

2. పీఎఫ్ ఖాతాకు లింక్ చేసిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌

3. ఆధార్ నంబర్

4. బ్యాంక్‌ అకౌంట్‌

5. డబ్బు విత్‌డ్రాకు ఇతర ప్రూఫ్‌ డాక్యుమెంట్స్‌

PF డబ్బును విత్‌డ్రా చేసుకునే విధానం

- ముందుగా EPFO e-SEWA పోర్టల్‌కి లాగిన్ అవ్వాలి

-Online Claim సెక్షన్‌ను ఎంచుకోవాలి

- మీ బ్యాంక్ అకౌంట్‌ వివరాలు ఇవ్వాలి

-టర్మ్స్‌&కండిషన్స్‌ను చదివి బాక్స్‌లో టిక్‌ చేయాలి

-డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి గల కారణాన్ని ఎంచుకోవాలి

పూర్తి వివరాలను ఎంటర్ చేసి..తగిన ప్రూఫ్‌ డాక్యుమెంట్స్‌ సమర్పించాలి.

చివరిగా మీ రిజస్టర్ట్ మెుబైల్ నంబర్‌ను ఓటీపీని ఎంటర్ సబ్‌మిట్‌పై నొక్కండి

కొద్దిరోజుల తర్వాత EPFO అధికార్లు అప్లికేషన్‌ను ప్రాసెస్‌ చేసి, అకౌంట్‌లోకి డబ్బు జమ చేస్తారు.

Updated : 10 Jan 2024 11:00 AM GMT
Tags:    
Next Story
Share it
Top