Home > ఆంధ్రప్రదేశ్ > శ్రావణ శుక్రవారం.. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

శ్రావణ శుక్రవారం.. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

శ్రావణ శుక్రవారం.. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..
X

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం కావడంతో పెద్దఎత్తున భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్లారు. సర్వదర్శనం కోసం భక్తులు 18 కంపార్ట్ మెంట్లలో వేచి చూస్తున్నారు. సర్వదర్శనానికి 10 గంటలకుపైగా సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

గురువారం 67,308 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 26,674 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3.82 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.




Updated : 25 Aug 2023 7:00 AM GMT
Tags:    
Next Story
Share it
Top