Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శలు

ఏపీ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శలు

ఏపీ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శలు
X

ఏపీ ప్రభుత్వంపై ప్రధాని మోదీ చిలుకలూరిపేట సభలో విమర్శలు చేశారు. రాష్ట్ర మంత్రులు అవినీతి, అక్రమాల్లో పోటీ పడుతున్నారని ఒకరికి మించి ఒకరు అవినీతి చేస్తున్నారని ప్రధాని ఆరొపించారు. కాంగ్రెస్, వైసీపీ వైర్వేరు కాదని ఈ రెండూ కుటుంబ పార్టీలే అని వైసీపీ గెలిపించేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తొంది. వైసీపీ అవినీతితో 5 ఏళ్లు అభివద్ధికి దూరంగా ఉందని మోదీ తెలిపారు.రాబోయే 5 ఏళ్లు ఏపీకి ఎంతో కీలకమని ఎన్నికల్లో ఓట్లు చీలకుండా ఎన్డీయేను గెలిపించాలి అని ఆయన కోరారు.

ఇండియా కూటమిలో ఎవరికి వారే అన్నట్లుగా పరిస్థితి తయారు అయ్యిందన్నారు. అలాంటి కూటమిలో ఎన్నికల తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఒకసారి ఆలోచించండని మోడీ ప్రజలకు సూచించారు. మేం ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలను కలుపుకొని ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం విపక్షాలను వాడుకుని వదిలేస్తోందని విమర్శించారు. జూన్‌ 4న ఫలితాల్లో ఎన్డీయేకు 400 సీట్లు దాటాలి.. డబుల్ ఇంజిన్‌ సర్కార్‌తోనే మన లక్ష్యాలు నెరవేరుతాయి.. పేదల కోసం ఆలోచించేది ఎన్డీయే ప్రభుత్వమేనని అన్నారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోందని ప్రధాని తెలిపారు.

Updated : 17 March 2024 1:39 PM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top