Home > ఆంధ్రప్రదేశ్ > కోట్లమందికి సత్య సాయిబాబా ఆదర్శం : మోదీ

కోట్లమందికి సత్య సాయిబాబా ఆదర్శం : మోదీ

కోట్లమందికి సత్య సాయిబాబా ఆదర్శం : మోదీ
X

ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సాయి హీరా గ్లోబల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను వర్చువల్‌గా ప్రధాని ప్రారంభించారు.ప్రారంభోత్సవ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు మరియు భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ..సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ పేరుతో కొత్త ప్రైమ్ కన్వెన్షన్ సెంటర్‌ను పొందుతున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది ఆధ్యాత్మికత మరియు విద్యా కార్యక్రమాలపై చర్చలకు కేంద్ర బిందువుగా మారుతుందని, ఇక్కడ పండితులు మరియు నిపుణులు సమావేశమవుతారని ఆయన తెలిపారు.





కోట్లమందికి సత్య సాయిబాబా ఆదర్శంగా నిలిచారని ప్రధాని అన్నారు. పుట్టపర్తి పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం ఒక గొప్ప అనుభూతి అని చెప్పారు. ప్రపంచానికి ప్రేమను పంచిన మహనీయుడు సత్యసాయి అని కొనియాడారు. ప్రేమించండి.. ప్రేమను పంచండంటూ సత్యసాయి సందేశాన్ని మోదీ గుర్తుచేశారు. సేవాభావమే జీవన విధానంగా సత్యసాయి మార్చుకున్నారని..తన జీవితాన్ని పేదలకు అంకితం చేసిన తీరు ఆదర్శనీయమని తెలిపారు. ప్రపంచానికి ఆయన సేవా మార్గాన్ని చాటిచెప్పారని గుర్తు చేశారు.

డిజిటల్ టెక్నాలజీ, 5జీ వంటి రంగాల్లో ప్రపంచంలోని అగ్రగామి దేశాలతో భారత్ పోటీ పడుతోందని ప్రధాని మోదీ వివరించారు. ప్రపంచంలో జరుగుతున్న రియల్ టైమ్ ఆన్‌లైన్ లావాదేవీలలో 40 శాతం భారతదేశంలోనే జరుగుతున్నాయని, పుట్టపర్తి జిల్లా మొత్తాన్ని డిజిటల్ ఎకానమీ దిశగా మార్చాలని భక్తులను ప్రధాని కోరారు. ఈ తీర్మానాన్ని నెరవేర్చేందుకు అందరూ కలసి వస్తే వచ్చే శ్రీ సత్యసాయిబాబా జయంతి నాటికి జిల్లా మొత్తాన్ని డిజిటల్‌గా మారుస్తామని ఆయన సూచించారు.


Updated : 4 July 2023 7:33 AM GMT
Tags:    
Next Story
Share it
Top