Bandaru Satyanarayana : అనకాపల్లిలో హైడ్రామా.. టీడీపీ సీనియర్ లీడర్ అరెస్ట్
X
అనకాపల్లిలో అర్ధరాత్రి నుంచి జరుగుతున్న హైడ్రామాకు తెరపడింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనకాపల్లిలోని వెన్నెలపాలెంలో గత ఆయన నివాసంలో.. 41ఏ, 41బీ కింద నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. మొదట అనకాపల్లి హాస్పిటల్ లో వైద్య పరీక్షలు జరిపి మంగళగిరికి తరలించేందుకు ఏర్పాటు చేయగా.. లాస్ట్ లో ప్లాన్ మార్చారు. గుంటూరుకు తరలించారు. ఇటీవల ఏపీ మంత్రి రోజాపై సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ డీజేపీకి లేఖ రాశారు. ఈ అంశంపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి భారీ పోలీసు బలగాలతో బండారు నివాసానికి చేరుకుని, గేట్లు తీసుకుని లోపలికి ప్రవేశించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.