Home > ఆంధ్రప్రదేశ్ > తిరుమల శ్రీవారిని దర్శించుకున్న షారుఖ్‌ ఖాన్‌

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న షారుఖ్‌ ఖాన్‌

సుప్రభాత సేవలో షారుఖ్, నయనతార

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న షారుఖ్‌ ఖాన్‌
X


ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ ఖాన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమార్తె సుహానాఖాన్‌, నయనతారతో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు షారుఖ్‌కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. సెప్టెంబర్ 7న‌ షారుఖ్‌ నటించిన ‘జవాన్‌’ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అంతకుముందు టీటీడీ అధికారులు షారుఖ్‌ ఖాన్‌కు ఆలయ ప్రధాన ద్వారం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

4 రోజుల క్రితం జమ్మూలోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయాన్ని కూడా షారుక్ ఖాన్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే, ఆయన ఆలయ సందర్శన కార్యక్రమం సీక్రెట్ గా జరిగింది. మీడియా కంట పడకుండా ఆయన జాగ్రత్త పడ్డారు. ముఖానికి మాస్క్ ధరించి ఆయన ఆలయానికి వెళ్లారు. అయితే, ఆలయ ప్రాంగణంలో షారుక్ నడుస్తూ వెళ్తున్న వీడియోలను కొందరు తమ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక షారుఖ్‌, నయనతార జంటగా నటించిన ‘జవాన్‌’ (Jawan) చిత్రం ఈ గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన సినిమా గ్లింప్స్, సాంగ్స్, ట్రైలర్లు మూవీపై అంచనాలను మరింత పెంచేశాయి. గతనెల 31న విడుదలైన ఈ సినిమా ట్రైలర్‍కు భారీ స్పందన వచ్చింది. ఇందులో షారుక్ ఖాన్ తండ్రి, కొడుకు రెండు పాత్రల్లో నటిస్తున్నాడని తెలుస్తున్నది. తమిళ స్టార్‌ డైరెక్టర్‌ అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షారుక్ ఖాన్‍తోపాటు బాలీవుడ్ బ్యూటి దీపికా పదుకొణె, లేడి సూపర్ స్టార్ నయనతార, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, ప్రియమణి, దంగల్ భామ సాన్య మల్హోత్రా, యోగిబాబు, అసుర్ సిరీస్ ఫేమ్ రిధి డోగ్రా, ఇజాజ్ ఖాన్ కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్‌ సంగీతం అందించాడు.


Updated : 5 Sept 2023 11:11 AM IST
Tags:    
Next Story
Share it
Top