Home > ఆంధ్రప్రదేశ్ > గత నంది అవార్డుల్లో నాకు అన్యాయం జరిగింది.. పోసాని కృష్ణ మురళీ

గత నంది అవార్డుల్లో నాకు అన్యాయం జరిగింది.. పోసాని కృష్ణ మురళీ

గత నంది అవార్డుల్లో నాకు అన్యాయం జరిగింది.. పోసాని కృష్ణ మురళీ
X

గత నంది అవార్డుల్లో తనకు అన్యాయం జరిగిందన్నారు ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి. ఓ నటుడిగా, రచయితగా, దర్శకుడిగా తనకు 15 అవార్డులైనా రావాలనీ, కానీ ఒకే ఒక్క అవార్డు ఇచ్చారనీ, అయితే కొన్ని పరిణామాల వల్ల అది కూడా క్యాన్సిల్ అయిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. గుంటూరులోని శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే ఈ నాటకోత్సవాల ప్రారంభోత్సవ సభలో పోసాని పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం నంది నాటకోత్సవాలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. 27మంది సభ్యులతో జ్యూరీ కమిటీని వేశామని, ఎలాంటి అవకతవకలకు తావు ఉండదన్నారు. ఒక్క అనర్హుడికి కూడా అవార్డు రాదని, అర్హులకే అవార్డులని చెప్పారు. ఎందుకంటే కళాకారులే జడ్జీలుగా ఉన్నారని వివరించారు. కాగా నాటకోత్సవాల సీడీ ని మంత్రి చెల్లుబోయిన వేణు ప్రారంభించారు.

నంది నాటకోత్సవాలలో 73 అవార్డుల కోసం 38 నాటక సమాజాలకు చెందిన 1200 మంది కళాకారులు పోటీ పడుతున్నారు. ఉత్తమ నాటకాలకు స్వర్ణ, రజత, కాంస్య నందులను బహూకరిస్తారు. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి రాత్రి 10 గంటల వరకూ రోజుకు ఐదు విభాగాల్లో ఐదు ప్రదర్శనలు ఉంటాయి. ప్రవేశం ఉచితమే. నాటకోత్సవాలు 29వ తేదీ వరకూ జరుగుతాయి.

Updated : 23 Dec 2023 2:02 PM IST
Tags:    
Next Story
Share it
Top