నారా లోకేష్పై పోసాని సంచలన కామెంట్స్..
X
టీడీపీ నేత నారా లోకేష్పై పోసాని కృష్ణ మురళీ ఫైర్ అయ్యారు. లోకేష్ తనపై పరువునష్టం కేసు వేయడం మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. కోర్టుకు వెళ్లేటప్పుడు లోకేష్ తనను హత్య చేయడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. చావుకు తాను భయపడడని.. తనకు ఏమైనా జరిగితే లోకేష్దే బాధ్యత అని అన్నారు. లోకేష్ తనపై రూ.4 కోట్లు పరువు నష్టం దావా వేశారని.. లోకేష్‌పై పరువు నష్టం దావా వేస్తే కనీసం 20 ఏళ్లు జైల్లో ఉంటారని పోసాని హెచ్చరించారు.
చంద్రబాబు అక్రమాలు బయటపెట్టినందుకే తనపై కక్ష గట్టారని పోసాని ఆరోపించారు. ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగల సమర్ధుడు చంద్రబాబని.. చంద్రబాబుపై ఎన్ని కేసులు ఉన్నా జైలుకు వెళ్లలేదన్నారు. కొంతమందికి కులం పిచ్చి ఎక్కించి తనను తిట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. గెలిచింది ఎవరైనా ప్రజలకు మంచి చేస్తున్నారా లేదా అనేది చూడాలని పోసాని అన్నారు. రైతుల కష్టాలను తీర్చడానికి వైఎస్సార్ రూ.11 వేల కోట్లకు పైగా రుణమాఫీ చేశారని ప్రశంసించారు.
అమరావతిలో 5 శాతం భూములు పేదలకు ఇవ్వాలని చట్టంలో వుందని.. ఆ చట్టాన్ని చంద్రబాబు తుంగలో తొక్కారని పోసాని ఆరోపించారు. పెదకాకానిలో తనకు కొన్ని ఇళ్ల స్థలాలు మాత్రమే వున్నాయని.. తన కష్టార్జితంతోనే ఆ భూములు కొన్నానని పోసాని స్పష్టం చేశారు. అవసరమైతే నా భూములన్నీ పేదలకు ఉచితంగా ఇస్తానని చెప్పారు. తాను అమ్ముడుపోయే వ్యక్తిని కాదని.. తన జీవితాంతం వైఎస్ జగన్ వెంటే వుంటానని కృష్ణమురళీ అన్నారు. జగన్ వ్యక్తిత్వం నచ్చే ఆయన్ని అభిమానిస్తున్నానని పోసాని తెలిపారు. తాను కూడా కేసు పెడతానని.. నిజం కావాలా, సాక్ష్యం కావాలా అని ప్రశ్నించారు.