Home > ఆంధ్రప్రదేశ్ > పవన్‎పై పోసాని సంచలన వ్యాఖ్యలు

పవన్‎పై పోసాని సంచలన వ్యాఖ్యలు

పవన్‎పై పోసాని సంచలన వ్యాఖ్యలు
X

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై నటుడు, ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ డెవలప్‎మెంట్ చైర్మన్ పోసాని కృష్ణమురళి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఫైర్ అయ్యారు. వాలంటీర్లను పవన్ తిడితే వారి ఫ్యామిలీ మెంబర్స్ ఫీల్ అవరా అంటూ ఆయన ప్రశ్నించారు. ఆడవారంటే గౌరవం అని చెప్పే వపన్‎కు వాలంటీర్లలో ఆడవాళ్లు ఉంటారని తెలియదా అని అడిగారు. మహిళలను గురించి అగౌరవంగా పవన్ మాట్లాడటం సరికాదన్నారు. వాలంటీర్ల వ్యవస్థ చాలా గొప్పదన్నారు. భీమవరంలో పవన్ ఓడిపోవడానికి కారణం టీడీపీ అని తెలిపారు.

మీడియాతో పోసాని మాట్లాడుతూ.." చంద్రబాబుపై గుప్పిట్లో పవన్ ఉన్నాడు. టీడీపీ వల్లే పవన్ భీమవరంలో ఓడిపోయాడు. పవన్‌ను టీడీపీ వాళ్లు పొరపాటున కూడా సీఎం కానివ్వరు. పవన్ కల్యాణ్‌ను ఓడించేందుకు టీడీపీ రూ.15 కోట్లు ఖర్చు చేసింది. బాబు హయాంలో లక్షలమంది డేటా హైదరాబాద్ వచ్చింది. పవన్ ఇప్పటికైనా చంద్రబాబును నమ్మడం ఆపాలి. సీఎం కాదు కదా ఎమ్మెల్యేగా కూడా బాబు గెలవనివ్వడు. ఇండస్ట్రీలో ఆడవాళ్లను తిట్టినప్పుడు పవన్ ఏం చేశాడు. .పవన్ తరపున చిరంజీవి చాలామందికి సారీ చేప్తున్నారు. కేంద్ర నిఘావర్గాలు పవన్‎కు ఎందుకు చెప్తాయి. ఇవన్నీ పవన్ మాటలైతే ఈపాటికే సారీ చెప్పేవాడు. పవన్ కల్యాణ్‌కు నిజంగా విలువలు ఉంటే వెంటనే వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలి" అని అన్నారు పోసాని.

Updated : 12 July 2023 2:37 PM IST
Tags:    
Next Story
Share it
Top