Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీలో గ్రూప్‌-1 పరీక్ష వాయిదా.. ఛైర్మన్‌ క్లారిటీ

ఏపీలో గ్రూప్‌-1 పరీక్ష వాయిదా.. ఛైర్మన్‌ క్లారిటీ

ఏపీలో గ్రూప్‌-1 పరీక్ష వాయిదా.. ఛైర్మన్‌ క్లారిటీ
X

ఏపీ ప్రభుత్వం గ్రూప్1 పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 17వ తేదిన గ్రూప్1 పరీక్ష ఉంటుందని గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ పరీక్షలు వాయిదా పడ్డాయని సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. ఆ వార్తలపై గ్రూప్1 అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ క్లారిటీ ఇచ్చారు. మార్చి 17వ తేదినే గ్రూప్1 పరీక్షలు యథావిధిగా జరుగుతాయన్నారు.

అభ్యర్థులు ఎలాంటి వదంతులు నమ్మొద్దన్నారు. పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. పరీక్ష వాయిదాపై జరుగుతోన్న ప్రచారం ఇక ఉండదని, ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా పరీక్షలపై ఫోకస్ పెట్టాలన్నారు. ఏపీలో గ్రూప్1కు సంబంధించి మొత్తం 81 పోస్టులను భర్తీ చేయనున్నారు. వాటిలో 9 డిప్యూటీ కలెక్టర్, 18 అసిస్టెంట్ ట్యాక్స్ కమిషనర్ పోస్టులు, 26 డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్స్, ఆర్డీవో, గ్రేడ్2 మున్సిపల్ కమిషనర్స్ పోస్టులు ఉన్నాయి.

మరోవైపు నేడు ఏపీలో గ్రూప్2 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 899 గ్రూప్2 ఉద్యోగాలకు నేడు ఏపీపీఎస్సీ పరీక్ష నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 4.63 లక్షల మంది పరీక్షకు హాజరైనట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. జూన్ లేదా జూలై నెలలో గ్రూప్2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలిపారు.


Updated : 25 Feb 2024 10:19 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top