ప్రత్తిపాటి శరత్ అరెస్ట్ వ్యవహారంలో కీలక పరిణామం..విజయవాడ జైలుకు తరలింపు
X
జీఎస్టీ ఎగవేత, నిర్మాణ పనుల్లో నిధుల మళ్లింపునకు పాల్పడ్డారనే ఆరోపణలపై ప్రత్తిపాటి శరత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్ అరెస్ట్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్‌కు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. వైద్య పరీక్షల తర్వాత..క్రీస్తు రాజపురంలోని ఒకటవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి కరీముల్లా ముందు శరత్‌ను పోలీసులు హాజరుపరిచారు. వాదోపవాదనలు విన్న జడ్జి సెక్షన్ 469 కింద శరత్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
ఈ కేసులో సెక్షన్ 409 చెల్లదని తేల్చిచెప్పారు. రిమాండ్ విధించడంతో శరత్‌ను విజయవాడలోని జిల్లా జైలుకు తీసుకెళ్లారు. డీఆర్ఐ అధికారుల ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు శరత్‌పై కేసు నమోదు చేశారు.దీంట్లో శరత్ తో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. శరత్‌పై ఐపీసీ 420, 409, 467, 471, 477(ఏ), 120బి రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాజకీయ కక్షతోనే జగన్ అక్రమంగా కేసు పెట్టించారని టీడీపీ నేత పట్టాభిరామ్ ఆరోపించారు. ఎన్నికల వేళ ఇబ్బందులకు గురి చేయాలనే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.