Home > ఆంధ్రప్రదేశ్ > Chandrababunaiduarrested రాజమండ్రి జైల్లో ఖైదీ మృతి.. టీడీపీ ఆందోళన

Chandrababunaiduarrested రాజమండ్రి జైల్లో ఖైదీ మృతి.. టీడీపీ ఆందోళన

Chandrababunaiduarrested రాజమండ్రి జైల్లో ఖైదీ మృతి.. టీడీపీ ఆందోళన
X

స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. బాబు అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన భద్రతపై టీడీపీ నేతలు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జైల్లో చంద్రబాబుకు సరైన సెక్యూరిటీ లేదని, ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆరోపించాయి. కాగా చంద్రబాబు ఉన్న జైల్లోని ఖైదీ ఇవాళ మృతి చెందడం మరోసారి కలకలం రేపింది. ఓ దోపిడీ కేసులో సెప్టెంబర్ 6న అరెస్ట్ అయిన గంజేటి వీర వెంకట సత్యనారాయణ.. చనిపోయాడు. దీనిపై జైళ్ల శాఖ డీఐజీ, రాజమండ్రి సెంట్రల్ జైల్ తాత్కాలిక సూపరిండెంట్ రవికిరణ్ స్పందించారు. కొంత కాలంగా జ్వరంతో బాధ పడుతున్న సత్యనారాయణను.. సెప్టెంబర్ 7న రాజమండ్రి ప్రభుత్వం హాస్పిటల్ కు తరలించారు.




ప్లేట్ లెట్స్ పడిపోవడంతో అత్యవసర చికిత్స కోసం సెప్టెంబర్ 19న కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. అయితే సత్యనారాయణకు డెంగీ అని తేలడంతో.. చికిత్స పొందుతూ ఆయన మృతిచెందాడని ప్రకటించారు. ఈ మృతితో టీడీపీ పార్టీలో ఆందోళన మొదలయింది. ఇప్పటికే చంద్రబాబుకు సరైన భద్రత ఇవ్వట్లేదని ఆరోపించగా.. తాజాగా చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. చంద్రబాబును జైల్లో చంపడానికి జగన్ కుట్ర పన్నాడని, అందుకే తప్పుడు కేసులు పెట్టి లోపలేశారని ఆరోపించారు. చంద్రబాబుకు హాని తలపెట్టే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇక అదే సమయంలో ఓ ఖైదీ చనిపోవడంతో ఆ ఆందోళన మరింత ఎక్కువైంది.




Updated : 21 Sept 2023 4:09 PM IST
Tags:    
Next Story
Share it
Top