Home > ఆంధ్రప్రదేశ్ > Chandrababu Health Issue : చంద్రబాబు ఆరోగ్యంపై డీఐజీ క్లారిటీ

Chandrababu Health Issue : చంద్రబాబు ఆరోగ్యంపై డీఐజీ క్లారిటీ

Chandrababu Health Issue : చంద్రబాబు ఆరోగ్యంపై డీఐజీ క్లారిటీ
X

స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని చెప్పారు (Chandrababu Health Issue ). స్కిన్ ప్రాబ్లం సహా డిహైడ్రేషన్కు గురయ్యారని.. వెంటనే వైద్యం చేయించామని చెప్పారు. మొదటి నుంచి చంద్రబాబును హై ప్రొఫైల్ ఖైదీగానే ట్రీట్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తాగునీరు , భోజనం విషయంలో నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నామన్నారు.

జైల్లో చంద్రబాబుకు ఆరోగ్య పరంగా, భద్రతా పరంగా ఎటువంటి సమస్య లేదని రవికిరణ్ చెప్పారు. ఒక హెడ్ వార్డెన్ , ఆరుగురు వార్డెన్‌లతో స్నేహ బ్యారెక్‌లో భద్రత ఏర్పాటు చేశామన్నారు. బయటి నుంచి వచ్చిన భోజనాన్ని పరీక్షించిన తర్వాతే ఇస్తున్నామని.. సిబ్బంది ప్రతి రోజు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని వివరించారు. జైలుకు వచ్చేటప్పుడు తెచ్చుకున్న మెడిసిన్స్ డాక్టర్ల పర్యవేక్షణలో వాడుతున్నారని తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యంపై బయట నుంచి చేసే ఆరోపణలు కరెక్ట్ కాదని.. తప్పుడు ఆరోపణలు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Updated : 13 Oct 2023 8:34 PM IST
Tags:    
Next Story
Share it
Top