Bandla Ganesh : 'పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై వ్యాఖ్యలు'.. సీఎం జగన్‌కు ఇదే నా విన్నపం
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలపై టాలీవుడ్ (Producer Bandla Ganesh )నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో రిలీజ్ చేశారు. వీడియోలో... నిన్నటి నుంచి తన మనసులో వేదన, బాధ కలిగిస్తోందన్నారు బండ్ల. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే తన బతుకు ఎందుకని, చిరాకు కలిగిస్తోందని అన్నారు. తనకు ఇష్టమైన, దైవ సమానుడైన పవన్ కల్యాణ్ గురించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారని చెబుతూ.. మీరు పెద్ద హోదాలో ఉన్నారు.. భగవంతుడు మీకు అద్భుతమైన పొజిషన్ ఇచ్చాడన్నారు. దశాబ్దాలుగా పవన్ కల్యాణ్ తో తిరుగుతున్నానని, ఆయన చాలా నిజాయితీ పరుడని, నీతిమంతుడని బండ్ల గణేష్ గుర్తు చేశారు.
ఎవరు కష్టాల్లో ఉన్నా ఆ కష్టం తనదే అని ముందుకెళ్లే వ్యక్తి, భోళా మనిషి పవన్ కల్యాణ్ అని అన్నారు. జీవితంలో కొందరికి కొన్ని చేదు సంఘటనలు జరుగుతాయి..అవి కూడా ఆయన ప్రమేయం లేకుండా జరిగినవే.. అని భావిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ కు విన్నవించే విషయం ఏంటంటే.. పవన్ కల్యాణ్ సమాజానికి ఉపయోగపడే వ్యక్తని, దేశం కోసం బతుకుతున్న వ్యక్తి అని చెప్పారు. స్వార్థం కోసం, స్వలాభం కోసం ఎవరితోనూ ఆయన ఎవరతోనూ మాట్లాడలేదన్నారు. షూటింగ్ లు చేసుకోమని, హాయిగా బతకమని చెప్పేవాడినన్నారు. మనం చచ్చిపోయినా జనం గుర్తు పెట్టుకోవాలని, జనానికి ఏదో చేయాలని తరిపించే వ్యక్తి పవన్ కల్యాణ్ అన్నారు. నిస్వార్థంగా జనం కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారన్న బండ్ల గణేష్, ఆయన సంపాదించిన సొమ్మును పార్టీ కోసం ఖర్చు చేస్తున్నారని అన్నారు. పవన్ కల్యాణ్ కు కులపిచ్చి ఉంటే తనను నిర్మాతను చేసే వాడా అని ప్రశ్నించారు. తాను అనుభవిస్తున్న ఈ హోదా మొత్తం పవన్ కల్యాణ్ పెట్టిన భిక్షేనన్నారు. దయచేసి పవన్ కల్యాణ్ లాంటి మంచి వ్యక్తిని అబాండాలు వేయవద్దని బండ్ల గణేష్ కోరారు.