Producer LakshmiPathi : జనసేన పార్టీలో చేరిన నిర్మాత కాయగూరల లక్ష్మీపతి
X
ఎన్నికలు సమీపిస్తోన్న వేళ జనసేనలో చేరికలు ఊపందుకున్నాయి. మొన్నటి వరకూ ఇండస్ట్రీ నుంచి పెద్దగా స్పందన లేకున్నా.. తాజాగా ‘ఐ.క్యూ’ అనే చిత్రాన్ని నిర్మించిన కాయగూరల లక్ష్మీపతి జనసేన పార్టీలో చేరాడు. అనంతపురం జిల్లాకు చెందిన లక్ష్మీపతి గతంలో తన సొంత ఖర్చులతో అనేక సేవాకార్యక్రమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. గతంలో ఈయన ఆర్టిఏ బోర్డు మెంబర్ గా, టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్ గా పనిచేశాడు.
ఈ సందర్భంగా కాయగూరలు లక్ష్మీపతి గారు మాట్లాడుతూ .. ‘‘పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానంతో గతంలో పలు సేవా కార్యక్రమాల్లో ఆయనతో పాల్గొనడం జరిగింది. సినిమా అంటే ఇష్టంతో IQ అనే సినిమాతో రంగ ప్రవేశం చేశాను. ఇంకా రెండు సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. సినిమాలంటే అంత ఇష్టం. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా నాకు చాలా సపోర్ట్ లభిస్తోంది. సినిమా ఇండస్ట్రీలో నుంచి సపోర్ట్ చేస్తున్న వాళ్లందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా బిజినెస్ రంగంలో నాకు సపోర్ట్ చేస్తున్న నా తోటి మిత్రులకు కృతజ్ఞతలు. సినిమాలు నిర్మిస్తూనే పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో జనసేన పార్టీలో జిల్లాలో ఎక్కడ పొత్తు మీద స్థానం ఇచ్చిన నా వంతు కృషి చేస్తూ పార్టీ కోసం ప్రజల కోసం పనిచేస్తాను. పవన్ కళ్యాణ్ గారు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా జనసేన పార్టీ నుంచి ప్రజలకు ఎంత సేవ చేయాలో అంత చేయడానికి సిద్ధంగా ఉన్నాను..’’ అన్నారు.