జగన్ అక్రమాస్తుల కేసుపై సుప్రీం కోర్టుకు రఘురామ కృష్ణంరాజు
Krishna | 1 Nov 2023 9:10 PM IST
X
X
ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు మీద ఎంపీ రఘురామ కృష్ణంరాజు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆ పిటిషన్ లో కోరారు. జగన్ కేసులో సీబీఐ కోర్టులో జాప్యం జరుగుతోందని అన్నారు. ఈ కేసులను సీబీఐ కోర్టు 3071సార్లు వాయిదా వేసినట్లు చెప్పారు. జగన్ ప్రత్యక్షంగా హాజరుకాకుండా సీబీఐ కోర్టు మినహాయింపు సైతం ఇచ్చినట్లు గుర్తుచేశారు. ఇప్పటికే వందల కొద్దీ డిశ్చార్జి పిటిషన్లు వేశారని.. వీటి వల్ల కేసు విచారణ ఆలస్యమవుతోందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ జరపనుంది.
Updated : 1 Nov 2023 9:10 PM IST
Tags: Raghurama Krishnam Raju jagan case jagan illegal assets case jagan cbi supreme court on jagan case supreme court narsapuram mp ycp mp ap mp ap news ap updates
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire