Home > ఆంధ్రప్రదేశ్ > తెలుగు రాష్ట్రాలకు రైల్వే బోర్డు గుడ్‎న్యూస్

తెలుగు రాష్ట్రాలకు రైల్వే బోర్డు గుడ్‎న్యూస్

తెలుగు రాష్ట్రాలకు  రైల్వే  బోర్డు గుడ్‎న్యూస్
X

తెలుగు రాష్ట్రాలకు రైల్వే బోర్డు గుడ్‎న్యూస్ చెప్పింది. ఏపీ, తెలంగాణలో రెండు సూపర్ ఫాస్ట్ రైల్వే లైన్ల సర్వేకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేకు లేఖ రాసింది. విశాఖపట్నం – విజయవాడ – శంషాబాద్, విశాఖపట్నం – విజయవాడ – కర్నూలు మార్గాల్లో సర్వే చేయనున్నారు. ఈ మార్గాల్లో సూపర్ ఫాస్ట్ రైల్వే ప్రాజెక్టు చేపట్టేందుకు అవసరమైన టెక్నికల్ ఫీజిబిలిటీని ఈ సర్వే ద్వారా నిర్ణయిస్తారు.

ఈ రెండు రైల్వే లైన్లు కలిసి 942 కిలోమీటర్ల మార్గంలో (గరిష్టంగా 220 kmph వేగంతో ప్రయాణించేలా) రైల్వై లైన్ నిర్మాణానికి అవసరమైన సర్వే నిర్వహించనున్నారు. ఈ సర్వే 6 నెలల్లో పూర్తికానుంది. సర్వే అనంతరం ప్రాజెక్టుపై ముందుకెళ్లనున్నారు. ఈ రైల్వే లైన్ల అంశాన్ని కిషన్ రెడ్డి పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి లేఖలు అందజేసిన నేపథ్యంలో తాజగా రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో కొత్త రైల్వే లైన్లు, రైల్వే స్టేషన్ల అభివృద్ధి, వై-ఫైలు, రూ.30వేల కోట్ల విలువైన డబ్లింగ్, ట్రిప్లింగ్ లైన్లు, వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అందించింది.


Updated : 1 Jun 2023 12:17 PM GMT
Tags:    
Next Story
Share it
Top