Home > ఆంధ్రప్రదేశ్ > కంటకాపల్లి వద్ద పూర్తైన రైల్వే పట్టాల పునరుద్ధరణ..

కంటకాపల్లి వద్ద పూర్తైన రైల్వే పట్టాల పునరుద్ధరణ..

కంటకాపల్లి వద్ద పూర్తైన రైల్వే పట్టాల పునరుద్ధరణ..
X

విజయనగరం జిల్లాలో రైలు ప్రమాద ఘటన జరిగిన చోట పరిస్థితి దారుణంగా మారింది. పట్టాలు చెల్లాచెదురు అవడంతో రైల్వే అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. రైళ్ల రాకపోకలను పునరుద్దరించేందుకు పట్టాలను రిపేర్ చేశారు. గూడ్స్ రైలుతో ట్రయల్ రన్ నిర్వహించారు. విశాఖ - విజయనగరం డౌన్లైన్ ట్రాక్ వైపు గూడ్స్ రైలును నడిపారు. గూడ్స్‌ వెళ్లిన అనంతరం అదే పట్టాలపై ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ను పంపారు.

రైల్వే ట్రాక్ను యుద్ధ ప్రాతిపదికన 19గంటల్లోనే పూర్తి చేశారు. డీఆర్‌ఎం సహా ఇతర సాంకేతిక సిబ్బంది ఘటన జరిగిన అరగంటలోనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. 1000 మందికిపైగా కార్మికులు, సిబ్బంది, వివిధ విభాగాలకు చెందిన సూపర్‌వైజర్లు నిరంతరాయంగా పని చేశారు. ప్రమాదం కారణంగా 47 రైళ్లు రద్దుకాగా.. 24 ట్రైన్లను దారి మళ్లించారు. 8 రైళ్ల గమ్యస్థానాలను మార్చగా.. మరో 8 రైళ్లు రీషెడ్యూల్ చేసినట్లు వాల్తేర్ డివిజన్ రైల్వే అధికారులు ప్రకటించారు.

ఆదివారం జరిగిన రైలు ప్రమాదంలో 13 మంది చనిపోగా.. 30 మంది గాయపడ్డారు. స్థానికులతో పాటు జిల్లా యంత్రాంగం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ ఎఫ్ సిబ్బంది సహాయక, పునరుద్ధరణ పనులల్లో ముమ్మరంగా పాల్గొన్నాయి.


Updated : 30 Oct 2023 3:12 PM GMT
Tags:    
Next Story
Share it
Top