నారా భువనేశ్వరికి షాక్.. ఇంత అమానవీయమా అంటూ..
X
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్లో జైలుకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలుసుకోవడానికి వెళ్లిన ఆయన సతీమణి భువనేశ్వరికి సిబ్బంది అనుమతి నిరాకరించారు. సరైన కారణాలు చూపకుండా తనను అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. ఖైదీలకు వారానికి మూడుసార్లు ములాఖత్ అవకాశం ఉన్నా ఎందుకు నిరాకరిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ‘‘నా భర్తను అక్రమంగా అరెస్టు చేసి చేశారు. కేసులో జరగాల్సినవి జరుగుతాయి. కానీ నిబంధనల ప్రకారం ములాఖత్‌కు అనుమతి ఇవ్వడం చాలా అమానవీయం’’ అని మండిపడ్డారు. భువనేశ్వరి ఇదివరకు ఒకసారి బాబును ఒకసారి కలుసుకుని మీడియాతో మాట్లాడారు. ఆయనకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని, భద్రత సరిగ్గా లేదని ఆరోపించారు. గురువారం బాలకృష్ణ, పవన్ కల్యాణ్, లోకేశ్.. బాబును కలుసుకున్నారు. రెండు ములాఖత్‌లు ముగిసినా ఇంకో ములాఖత్ ఉంది. కాగా, ఈ కేసులో బాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణను విజయవాడలోని ఏసీబీ కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది.