Skill case: రేపు రాజమండ్రి సెంట్రల్ జైలుకు రజనీకాంత్
X
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా చంద్రబాబును తన కలిసి తన మద్దతివ్వాలనుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ రేపు (సెప్టెంబర్ 16) రాజమండ్రి జైలుకు వెళ్లనున్నారు. మధురపూడి విమానాశ్రయం నుంచి నేరుగా భువనేశ్వరీ, బ్రహ్మణీలను పరామర్శించి.. అనంతరం చంద్రబాబును కలవడం కోసం ములాఖత్ కు అప్లై చేస్తారు. చంద్రబాబు, రజనీకాంత్ మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో కూడా రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీళ్లిద్దరి అనుబంధం గురించి ట్రోల్స్ వచ్చినా వాటిని లెక్క చేయని రజనీ.. బాబుతో స్నేహాన్ని కొనసాగించారు. తాజాగా కేసు విషయంలో లోకేశ్ కు ఫోన్ చేసిన మాట్లాడారు. తన సపోర్ట్ ఎప్పటికీ చంద్రబాబుకు ఉంటుందని చెప్పుకొచ్చారు.