Home > ఆంధ్రప్రదేశ్ > సీఎం జగన్తో ఆర్జీవీ భేటీ.. రాజకీయాల్లో ఏంట్రీ కోసమేనా...?

సీఎం జగన్తో ఆర్జీవీ భేటీ.. రాజకీయాల్లో ఏంట్రీ కోసమేనా...?

సీఎం జగన్తో ఆర్జీవీ భేటీ.. రాజకీయాల్లో ఏంట్రీ కోసమేనా...?
X

వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవీ.. ఇవాళ (జూన్ 19) తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ అయ్యారు. అక్కడా దాదాపు గంటపాటు వీరిద్దరి మధ్య చర్చలు నడిచాయి. అయితే, ఆర్జీవీ జగన్ ను కలవడంపై పలువురు.. ‘రాజకీయాల్లో చేరడానికి ఇక్కడికి వచ్చాడ’ని ప్రచారం చేస్తున్నారు. ఏపీ రాజకీయాల నేపథ్యంలో ఆర్జీవీ ‘వ్యూహం’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దానిపై క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ.. వ్యూహం సినిమాపై చర్చించేందుకే జగన్ తో సమావేశం అయినట్లు తెలిపాడు. కాగా సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఫొటోలు కూడా విడుదల అయ్యాయి. సీఎం జగన్, భారతి క్యారెక్టర్ల నేపథ్యంతో తీస్తున్న ఈ సినిమాలో.. జగన్ పాత్రలో అజ్మల్, భారతి పాత్రలో మానసలు నటిస్తున్నారు. అయితే, సమావేశం పూర్తయిన వెంటనే బయటికి వచ్చిన ఆర్జీవీ.. మీడియాతో ఏం మాట్లాడకుండా వెళ్లి పోయాడు.




Updated : 19 Jun 2023 10:46 PM IST
Tags:    
Next Story
Share it
Top