పవన్‌పై మరోసారి విరుచుకుపడ్డ ఆర్జీవీ
X
ఏపీలో పొలిటికల్ హీట్ మరింత వేడెక్కుతోంది. టీడీపీ, జనసేన కూటమి నుంచి తొలి జాబితా ప్రకటించిన తర్వాత పలువురు నేతలు పెదవి విరుస్తున్నారు. నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు, 3 లోక్‌సభ స్థానాలను కేటాయించారు. దీనిపై పవన్ వివరణ కూడా ఇచ్చారు. 24 సీట్లేనా అని అనుకోవద్దని, 3 లోక్ సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా కలిపితే మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లో తాము పోటీ చేస్తున్నట్లేనని పవన్ కళ్యాణ్ తెలిపారు.
పవన్ మాటలపై మరోసారి విలక్షణ దర్శకుడు ఆర్జీవీ స్పందించారు. ఎప్పుడూ వివాదాల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ..పవన్‌పై మాట్లాడుతూ ట్వీట్ చేశారు. మైండ్ బ్లోయింగ్ లాజిక్ అంటూ పవన్ వీడియోకు ట్యాగ్ చేశారు. రెండు లక్షల పుస్తకాల సారాన్ని పిండి మతిపోయే లాజిక్‌ను చెప్పారంటూ పవన్‌పై వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. అలాగే మరో ట్వీట్‌లో కూడా పవన్‌ను విమర్శించారు. 23 సీట్లు ఇస్తే టీడీపీ లక్కీ నెంబర్ అవుతుందని ట్రోల్ చేస్తారని, అదే 25 సీట్లు ఇస్తే పావలాకి పావలా సీట్లు అంటూ ట్రోల్ చేస్తారని, అందుకే అదీ కాకుండా ఇదీ కాకుండా 24 నంబర్ ఫిక్స్ చేసినట్లు ఆర్జీవీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.