Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీ యువతకు పవన్ కళ్యాణ్ ఉగ్రవాదం నేర్పిస్తున్నడు: RGV

ఏపీ యువతకు పవన్ కళ్యాణ్ ఉగ్రవాదం నేర్పిస్తున్నడు: RGV

ఏపీ యువతకు పవన్ కళ్యాణ్ ఉగ్రవాదం నేర్పిస్తున్నడు: RGV
X

జనాలకు చేరువయ్యేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యాత్రలో పవన్ చేసిన వ్యాఖ్యలపై రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా.. తనదైన్ శైలిలో స్పందించాడు. ‘అధికారంలోకి వస్తే పీక పిసికి చంపేస్తామంటూ’ పవన్ అన్న మాటలకు కౌంటర్ ఇచ్చిన ఆర్జీవీ.. ‘ఇలాంటి మాటలు హిట్లర్, సద్దాం, కిం జోంగ్ లాంటి ఉన్మాదులే మాట్లాడుతారు. పవన్ ఏపీ యువతలో ఉగ్రవాదం నేర్పుతున్నాడు. తీవ్రవాది కంటే ప్రమాదంగా తయారవుతున్నాడ’ని ఆర్జీవీ మండిపడ్డాడు.

‘‘చివరికి రాజకీయ క్యాంపైన్లు ఇక్కడికి చేరాయి.. తననుకున్నదాన్ని ఎవరు వ్యతిరేకించినా, అధికారంలో కొస్తే పీక పిసికేసి చంపేస్తా, బట్టలూడదీసి పరిగెత్తిస్తా, చర్మం వొలిచేస్తా లాంటి హింసాత్మికమైన బెదిరింపులు ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో ఎవరూ అనుండరు. హిట్లర్, సద్దాం, కిం జొంగ్ ఉన్ తో సహా..

ఇంకో విషయమేంటంటే అధికారంలోకి వస్తే నరికేస్తాను అంటే.. ఇప్పుడు అధికారంలో ఉవున్న పార్టీ అది చేయచ్చని చెప్పడమా ?

ఏది ఏమైనా ఒక ప్రజాస్వామ్య దేశంలో తన ఫాలోయర్స్ కి డైరెక్ట్ గా ఇంత బ్రూటల్ వయోలెన్స్ ని ప్రభోదించడం తీవ్రవాదం కన్నా ప్రమాదకరమైన ఆటవిక మనస్తత్వం.

ఇలాంటి హింసని ఎంకరేజ్ చేస్తూ అరుస్తుంటే.. ఆ మీటింగ్లకొచ్చే ఆ యువకులు భవిష్యత్తులో ఏమవ్వాలనుకుంటున్నాడో ఆ పవన్ కళ్యాణ్ కే తెలియాలి.

పైగా ఈ వయోలేంట్ బెదిరింపులన్ని లైవ్ మీడియా ముందు ప్రజలందరూ లివింగ్ రూమ్స్ లో పిల్లలతో పాటు టీవీ చూస్తుండగా’’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు.

వర్మ వ్యాఖ్యలపై పవన్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ‘నువ్వు బూతు సినిమాలు తీసి ఎవరికి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావ్’, ‘నువ్వు మాట్లాడతుంటే.. పతివ్రత పరమాన్నం లాంటి మాటలు గుర్తుకొస్తున్నాయి’, ‘వర్మా.. నువ్వేంటి సడెన్ గా గౌతమ బుద్దిడిగా మారిపోయావ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Updated : 23 Jun 2023 5:50 PM IST
Tags:    
Next Story
Share it
Top