ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభం..!
X
ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభమైంది. చిత్తూరు జిల్లాకు చెందిన రామచంద్ర యాదవ్ తన నూతన పార్టీని ప్రకటించారు. గుంటూరులో ‘ప్రజా సింహగర్జన బహిరంగ సభ’ను నిర్వహించి పార్టీ పేరును ప్రకటించారు. ‘బీసీవై (భారత చైతన్య యువజన)’ పేరిట పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు రామచంద్ర యాదవ్ తెలిపారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా తాను పార్టీ పెట్టినట్లు వెల్లడించారు.
రాష్ట్రం అభివృద్ధి కోసం కొత్త రాజకీయ ప్రస్థానం అవసరమని తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. సీఎం జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయని.. పురాణాల్లో రాక్షసుల్ని జగన్ పాలన గుర్తుచేస్తోందని విమర్శించారు. పెద్ద తలకాయలు నుంచి కార్యకర్తల వరకు అందరూ దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో ప్రైవేటు భూములు, ప్రైవేటు ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. వాలంటీర్ వ్యవస్థపై కూడా రామచంద్రయాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నెలకు రూ.5 వేల గౌరవ వేతనం పేరుతో వారితో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల వైసీపీ సమావేశం ముగిసిన తర్వాత.. వాలంటీర్లతో చెత్తను ఎత్తించారని ఆరోపించారు. ఈ సభకు అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్,సూరజ్ మండల్, వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రామచంద్రయాదవ్ అభిమానులు హాజరయ్యారు. హాజరయ్యారు.