Home > ఆంధ్రప్రదేశ్ > Ramanaidu's studio : రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

Ramanaidu's studio : రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

Ramanaidus studio :  రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంలో  ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
X

విశాఖ రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వన్నికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ఆ ల్యాండ్‌ను లేఅవుట్‌గా మార్చి అమ్మడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతివాదులకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. 2003 సెప్టెంబర్ 13న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్న అవసరాలు మినహా ఇతర కార్యకలాపాలకు ఆ భూములు వాడకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వానికి, ప్రతివాదులకు తాఖీదులు జారీ చేసింది. నోటీసులపై మార్చి 11లోపు స్పందించాలని ఆదేశించింది.





రామానాయుడు స్టూడియోకు సినీ అవసరాల కోసం 2003లో అప్పటి ప్రభుత్వం విశాఖలో 35 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే జగన్ సర్కారు వచ్చిన తర్వాత కోస్టల్ నిబంధనలకు విరుద్ధంగా లేఔట్ గా మార్చి ఇతర కార్యకలాపాలకు వినియోగించుకునేందుకు అనుమతించింది. ఈ వ్యవహారాన్ని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో.. ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ పై విచారణను జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ అభయ్ ఎస్ ఓఖాల ధర్మాసనం చేపట్టింది. రామానాయుడు స్టూడియోకి భూమిని ఎందుకు కేటాయించారు? ఇప్పుడు వేరే కార్యకలాపాలు చేపట్టారా? అని పిటిషనర్ తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది.




Updated : 19 Jan 2024 1:59 PM IST
Tags:    
Next Story
Share it
Top