Ramgopal Varma : టీడీపీతో జనసేన పొత్తు.. పవన్పై వర్మ సంచలన వ్యాఖ్యలు
X
పవన్ కల్యాణ్ అంటే రాంగోపాల్ వర్మకు అసలు పడదు. ఎప్పుడు విమర్శిద్దామా అని చూస్తుంటాడు. జగన్ జోలికి వచ్చినా రాకున్నా.. చంద్రబాబు, పవన్ లపై తరుచూ ఏదో ఓ విషయంలో విమర్శిస్తూనే ఉంటారు. మొన్న జనసేన సీఎం చంద్రబాబు అంటూ కామెంట్ చేశారు. తాజాగా జనసేన - టీడీపీ పొత్తుపై సెటైరికల్ ట్వీట్ చేశారు. నక్కలు గుంపులుగా వస్తాయి.. పులి సింగిల్గా వస్తుందంటూ ఆయన ట్వీట్ చేశారు.
టీడీపీతో జనసేనకు ఎందుకు పొత్తు అవసరమో పవన్ చెప్పలేకపోతున్నాడని ఆర్జీవీ విమర్శించారు. ‘‘పవన్కు తనపై తనకు నమ్మకం లేదా. లేదా తాను పొత్తు పెట్టుకోవాలనుకునే పార్టీలను ప్రజలు నమ్మడం లేదని ఆయన అనుకుంటున్నారా..?. జగన్కు ఆయనపై ఆయనకు గట్టి నమ్మకం ఉంది. అందుకే తనకు పొత్తులు అవసరం లేదని చెప్పారు. నక్కలే గుంపులుగా వస్తాయి.. పులి సింగిల్గా వస్తుంది’’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పై జనసేన, టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.