Home > ఆంధ్రప్రదేశ్ > "మోహన్ బాబుతో ప్రాణహాని..కర్రలు, కత్తులతో వచ్చారు"

"మోహన్ బాబుతో ప్రాణహాని..కర్రలు, కత్తులతో వచ్చారు"

మోహన్ బాబుతో ప్రాణహాని..కర్రలు, కత్తులతో వచ్చారు
X

చిత్తూరు జిల్లా రంగంపేట గ్రామస్తులు మోహన్ బాబుపై సంచలన ఆరోపణలు చేశారు. తమను చంపేందకు ప్రయత్నిస్తున్నారని ఎంపీటీసీ సభ్యుడు‌ బోస్ చంద్రారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆరుగురు వ్యక్తులు గత రాత్రి కత్తులు, కర్రలతోవచ్చినట్లు తెలిపారు. వారికి నిందితులకు మోహన్ బాబు PRO సతీష్, మంచు అసోసియేషన్ అధ్యక్షుడు సునీల్ చక్రవర్తి... ఫొటోలు, రూ.3000 మనీని ఫోన్ పే ద్వారా పంపినట్లు వెల్లడించారు. ఈ మేరకు మోహన్ బాబు, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులతో కలిసి ఆందోళనకు దిగారు.

భూ వివాదం నేపథ్యంలో...

విద్యానికేతన్ సంస్థల డంపింగ్ యార్డు కోసం నాగపట్నం సర్వే నెంబర్ 10.2లో 35 సెంట్ల భూమిని దక్కించుకునేందుకు మోహన్ బాబు ప్రయత్నిస్తున్నారని... అయితే స్థలం ఇచ్చేందుకు గ్రామస్తులు నిరాకరించడంతో కోపం పెంచుకున్నట్లు ఎంపీటీసీ బోస్ చంద్రారెడ్డి ఆరోపించారు. 2023 ఫిబ్రవరిలో సమాచార హక్కు చట్టం కింద వివరాలు సేకరించామని ఇక అప్పటి నుంచి మరింత కక్ష గట్టారని వివరించారు. గతంలో కూడా ఓసారి దాడికి ప్రయత్నించినట్లు తెలిపారు. మళ్లీ ఇప్పుడు మరోసారి మా హత్యకు స్కెచ్ వేశారని వెల్లడించారు. తమకు మోహన్ బాబుతో ప్రాణహాని ఉందని చెప్పారు.

ఏం జరిగిందంటే..

తిరుపతి మారుతి నగర్‌లో నివసిస్తున్న రంగంపేట ఎంపీటీసీ ఎంపీటీసీ సభ్యుడు‌ బోస్ చంద్రారెడ్డి ఇంటి వద్ద ఆరుగురు సభ్యులు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. కత్తులు, కర్రలతో హల్చల్ చేసినట్లు సమాచారం. అయితే పోలీసుల రావడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. కానీ హేమంత్ అనే వ్యక్తి మాత్రం పెట్రోల్ బాటిల్‌తో రెండో సారి వచ్చి బోస్ చంద్రారెడ్డి అనుచరులకు దొరికిపోయాడు. దీంతో అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

Updated : 18 Jun 2023 7:33 PM IST
Tags:    
Next Story
Share it
Top