Home > ఆంధ్రప్రదేశ్ > స్కాంలో ఏం జరిగిందో పవన్కు తెలుసు..!

స్కాంలో ఏం జరిగిందో పవన్కు తెలుసు..!

స్కాంలో ఏం జరిగిందో పవన్కు తెలుసు..!
X

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అక్రమ కేసులు పెట్టి చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తప్పుబట్టారు. ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ క్రమంలో పవన్ తీరును వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు. టీడీపీ నాయకులు, బాబు కొడుకు లోకేశ్ కన్నా.. పవన్ కల్యాణ్ కే ఎక్కువ బాధైతుందని ఎద్దేవా చేస్తున్నారు. కాగా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా పవన్ తీరును తప్పుబట్టారు. ఇదే విషయంపై ట్విట్టర్ వేదికగా.. ఆర్జీవీ పవన్ కు ప్రశ్నల వర్షం కురిపించాడు. స్కిల్ స్కాం కేసులో మీకేం తెలుసో వన్ వర్డ్ ఆన్సర్ గా చెప్పాలని 9 ప్రశ్నలు సంధించాడు. అవేంటంటే..?

1) అసలు స్కిల్ స్కాం జరిగిందా లేదా??

2) ఒకవేళ జరిగుంటే, CBN గారికి తెలియకుండా జరిగిందా?

3) 300 కోట్లు పైగా ప్రజా ధనాన్ని ప్రొసీజర్స్ ఫాలో అవ్వకుండా , ఆఫీసర్స్ చెప్తున్నా వినకుండా రిలీజ్ చేశారా లేదా?

4) ఒక వేళ హెడ్ ఆఫ్ గవర్నమెంట్ CBN గారికి స్కాం గురించి తర్వాత తెలిసుంటే , దానిమీద ఇమ్మిడియట్ ఆక్షన్ తీసుకోకపోవటం కరెక్టా?

5) FIR అనేది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మాత్రమే... ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ లో సేకరించిన ఇన్ఫర్మేషన్ బట్టి ఎప్పుడైనా ఎవరి పేరైనా యాడ్ చెయ్యచ్చన్న విషయం మీకు తెలియదా?

6) చూపించిన డాక్యుమెంట్స్ బట్టి క్రైమ్ చేసినట్టు ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ వుందని నమ్మిన జడ్జ్ గారు బెయిల్ ఇవ్వకపోవటం తప్పా?

7) సెక్షన్ 409 అప్లై అవుతుందని రిమాండ్ గ్రాంట్ చేసిన జడ్జ్ గారు కరప్టా ?

8) లీడర్స్ వాళ్ళ నలభై ఏళ్ల బ్యాక్గరౌండ్ బట్టి కాదు , వాళ్ళు చేసే పనులు బట్టి అనే విషయం మీకు తెలియదా ?

9) నా తొమ్మిదవ చివరి ప్రశ్న , అసలు స్కిల్ స్కాం కేసు మీకేమర్ధమయ్యిందో , దానిలోని తప్పులెంటో ఒక వీడియో లో కెమెరా వంక చూస్తూ వివరించగలరా?

థాంక్యూ అండి..





Updated : 11 Sept 2023 5:13 PM IST
Tags:    
Next Story
Share it
Top