Home > ఆంధ్రప్రదేశ్ > రెచ్చిపోయిన దొంగలు.. రైలు బోగీల్లో బీభత్సం

రెచ్చిపోయిన దొంగలు.. రైలు బోగీల్లో బీభత్సం

రెచ్చిపోయిన దొంగలు.. రైలు బోగీల్లో బీభత్సం
X

ఏపీలోని ప్రకాశం (Prakasam) జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. సింగరాయకొండ-కావలి మధ్య రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో దోపిడీకి (Robbery) పాల్పడ్డారు. సికింద్రాబాద్‌ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌లో (Hyderabad express) చోరీ చేశారు. రైలులోకి చొరబడిన దుండగులు.. ప్రయాణికుల నుంచి డబ్బులు, బంగారం, విలువైన వస్తువుల్ని ఎత్తుకెళ్లారు. హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఉలవపాడు పరిధిలోని సుబ్బరాయుడు సత్రం గేటు వద్ద ఆరుగురు దుండగులు నిలిపివేశారు. అనంతరం దొంగలు రైలులోని ఎస్‌-1, ఎస్‌-2, ఎస్‌-3 బోగీల్లోకి ప్రవేశించి మహిళల వద్ద ఉన్న సుమారు 30 తులాల బంగారాన్ని చోరీ చేశారు.

తటితో ఆగని దొంగలు.. సికింద్రాబాద్‌ నుంచి తాంబరం వెళ్తున్న చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లో (Charminar express) కూడా చోరీ చేశారు. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం వీరేపల్లి వద్ద సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న చార్మినార్ ట్రైన్‌లో చోరీకి పాల్పడ్డారు. ఎస్ 1, ఎస్ 2 బోగీల్లో దొంగతనానికి పాల్పడ్డారు. ప్రయాణికుల నుంచి భారీగా బంగారం, నగదును దుండుగుల దోచుకున్నారు. అనంతరం ట్రైన్ చైన్ లాగి దొంగలు పరారయ్యారు. అర్ధరాత్రి 1.20 నుంచి 1.50 గంటల మధ్య దోపిడీ ఘటన చోటుచేసుకున్నట్లు ప్రయాణికులు వెల్లడించారు. రెండు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో దోపిడీ ఘటనపై ప్రయాణికులు తెట్టు, కావలి రైల్వే స్టేషన్లలోరైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



Updated : 14 Aug 2023 11:01 AM IST
Tags:    
Next Story
Share it
Top