Home > ఆంధ్రప్రదేశ్ > ప్రతి నెల రూ.10 లక్షలు.. దుర్గ గుడి పాలకుల జేబుల్లోకి భక్తుల విరాళం..?

ప్రతి నెల రూ.10 లక్షలు.. దుర్గ గుడి పాలకుల జేబుల్లోకి భక్తుల విరాళం..?

ప్రతి నెల రూ.10 లక్షలు.. దుర్గ గుడి పాలకుల జేబుల్లోకి భక్తుల విరాళం..?
X

ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనానికి వచ్చే భక్తులు.. అక్కడి దేవాలయాల్లో ఏర్పాటు చేసే అన్నదానాన్ని స్వీకరించి ఆకలిదప్పులు తీర్చుకుంటుంటారు. అన్నప్రసాదాన్ని కళ్లకద్దుకొని భుజిస్తారు. ఆ అన్నప్రసాదానికయ్యే ఖర్చు కూడా ఎంతోమంది భక్తులిచ్చే విరాళాల నుంచే వినియోగిస్తారు. అయి భక్తులు స్వీకరించే ఆ ఆహారంలోనూ.. విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ పాలకులు కక్కుర్తి ప్రదర్శిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయ సిబ్బందిలోని కొందరు.. అక్కడ భక్తులకు అందించే అన్నదానంలో తక్కువ రకం బియ్యం ఉపయోగిస్తూ.. నెలకు రూ.10 లక్షలు వారి వారి జేబుల్లో వేసుకుంటున్నారట.

ఆలయానికొచ్చిన రూ.100 కోట్లు విరాళాల నుంచి ప్రతీ రోజూ అన్నదానం చేస్తున్నారు. అయితే నిబంధన ప్రకారం.. అన్నదానానికి నాణ్యమైన బియ్యం కాకుండా కాస్త తక్కువ రకం బియ్యాన్ని వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి నెలా కిలోకు రూ.10 , వంద టన్నుల సరఫరాకు సుమారుగా రూ.10 లక్షలు బియ్యం సరఫరా చేసే కాంట్రాక్టర్‌కు మిగులుతోంది. ఆ సొమ్మును ఓ అధికారి నేరుగా సగం జేబులో వేసుకొని, మిగిలింది కొందరు పాలకులకు ముడుపులు చెల్లిస్తూ వ్యవహారాన్ని నడిపిస్తున్నారట

నిజానికి రూ.100 కోట్ల విరాళానికి ప్రతి నెలా వచ్చే వడ్డీతో రోజుకు నాణ్యమైన బియ్యంతో 6 వేల మందికి అన్నదానం చేయవచ్చు. కానీ గత రెండు నెలలుగా తక్కువ రకం బియ్యం వినియోగించడమే కాకుండా... ఆ అన్నదానాన్ని మూడు, నాలుగు వేల మందికి మాత్రమే సరిపెడుతున్నారట. ఆలయ ఈవో వ్యక్తిగత సెలవులపై ఉండటంతో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని కొందరు దేవస్థానం ఉద్యోగులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు దృష్టి సారించకుంటే దుర్గగుడి ప్రతిష్ట మరింత మసక బారే ప్రమాదం ఉంది.

Updated : 21 Feb 2024 8:00 AM IST
Tags:    
Next Story
Share it
Top