Home > ఆంధ్రప్రదేశ్ > YS Sharmila : మహిళలకు నెలకు రూ.5000.. యాప్ ప్రారంభించిన వైఎస్ షర్మిల

YS Sharmila : మహిళలకు నెలకు రూ.5000.. యాప్ ప్రారంభించిన వైఎస్ షర్మిల

YS Sharmila : మహిళలకు నెలకు రూ.5000.. యాప్ ప్రారంభించిన వైఎస్ షర్మిల
X

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ చీఫ్‌గా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. మరో రెండు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. ప్రజలకు దగ్గరవుతూ మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. అధికార వైసీపీని, ప్రతిపక్ష టీడీపీని ఎండగడుతూ తాము చేయబోయే కార్యక్రమాల గురించి, పథకాల గురించి వివరిస్తూ వస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలను ఆకర్షించేందుకు సభలను నిర్వహిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలోకి వస్తే తీసుకోబోయే సంక్షేమ పథకాలను వివరిస్తూ వస్తున్నారు. తాజాగా 'ఇందిరమ్మ అభయం' పథకం యాప్‌ను వైఎస్ షర్మిల లాంచ్ చేశారు. పథకంలో భాగంగా ఏపీలోని పేద మహిళలందరికీ ప్రతినెలా రూ.5 వేలును ఇవ్వనున్నట్లు ప్రకటించారు. యాప్ ప్రారంభోత్సవం సందర్భంగా అర్హులైన కొంతమంది మహిళల వివరాలను యాప్‌లో నమోదు చేశారు.

వైఎస్ షర్మిల మాట్లాడుతూ..పేదింటి మహిళల కోసం 'ఇందిరమ్మ అభయం' పథకాన్ని తీసుకొచ్చామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు రూ.5 వేలు ప్రతినెలా అందుతుందన్నారు. పేద కుటుంబాలను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రత్యేక పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొస్తున్నట్లు తెలిపారు. వైసీపీ, టీడీపీ పాలనలో ప్రజలకు ఎటువంటి మేలు జరగలేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. ఈ ఎన్నికల్లో అందరం కలిసి కాంగ్రెస్ సర్కార్‌ను తీసుకొద్దామని పిలుపునిచ్చారు.


Updated : 10 March 2024 8:40 AM GMT
Tags:    
Next Story
Share it
Top