Home > ఆంధ్రప్రదేశ్ > ధరణి విషయంలో బీజేపీది పూటకో మాట, నోటికో మాట - హరీష్ రావు

ధరణి విషయంలో బీజేపీది పూటకో మాట, నోటికో మాట - హరీష్ రావు

ధరణి విషయంలో బీజేపీది పూటకో మాట, నోటికో మాట - హరీష్ రావు
X

పోర్టల్ విషయంలో బీజేపీ వైఖ‌రిని మంత్రి హ‌రీశ్ రావు తీవ్రంగా ఖండించారు. బీజేపీ పార్టీది పూటకో మాట, నోటికో మాట అన్నట్లు ఉంద‌ని అన్నారు. గల్లీ బీజేపీ నాయకులు ఒకటి చెప్తే, ఢిల్లీ నేతలు ఇంకొకటి చెప్తున్నార‌ని విమ‌ర్శించారు. మొన్న ధరణిని రద్దు చేయమని రాష్ట్ర నాయకులు ప్రకటిస్తే, రద్దు చేస్తామని నడ్డా నిన్న చెప్పిన విషయాన్ని మంత్రి హ‌రీష్ రావు గుర్తు చేశారు. బీజేపీ రెండు నాలుకల ధోరణికి ఇది మరో నిదర్శనమ‌ని చెప్పారు. బీజేపీలో నేతల మధ్య సుతి కలవదు, ఒకరి మాట మరొకరు వినరు అని హ‌రీష్ విమర్శించారు. ఇక కాంగ్రెస్ నేతలైతే ధరణి గురించి ఏమాత్రం అవగాహన లేకుండా విమర్శించడమే పనిగా పెట్టుకున్నాట్లు మంత్రి మండిపడ్డారు.

రాష్ట్రంలో రైతు బంధు పండుగ మ‌ళ్లీ మొద‌లైందని మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. 11వ విడత రైతు బంధు ప్రారంభ‌మైన సంద‌ర్భంగా ఆయ‌న ఈ మేరకు ట్వీట్ చేశారు. రైతు బంధు పథకం కింద తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పెట్టుబ‌డి సాయం ల‌క్ష‌లాది మంది రైతుల‌కు నేటి నుంచి ప్రారంభం అవుతున్న‌ట్లు చెప్పారు. రైతుల అభివృద్ధి, శ్రేయ‌స్సు లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారన్న హరీష్ రావు.. తొలి రోజు రైతు బంధు కింద 645.52 కోట్ల నిధుల‌ు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు వెల్లడించారు. జూన్ 26న దాదాపు 22,55,081 మంది రైత‌లుకు రైతు బంధు అందిన‌ట్లు ఆయ‌న ప్రకటించారు.

Updated : 26 Jun 2023 5:23 PM IST
Tags:    
Next Story
Share it
Top