Home > ఆంధ్రప్రదేశ్ > షర్మిల కాంగ్రెస్లో చేరడంపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

షర్మిల కాంగ్రెస్లో చేరడంపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

షర్మిల కాంగ్రెస్లో చేరడంపై సజ్జల సంచలన వ్యాఖ్యలు
X

వైఎస్ షర్మిలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. షర్మిల తన అన్న, సీఎం జగన్పై అక్రమ కేసులు పెట్టి వేధించిన పార్టీతో కలిశారని మండిపడ్డారు. వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. అయితే.. షర్మిల ఓ పార్టీకి అధ్యక్షురాలని, ఆమె నిర్ణయాలు ఆమె ఇష్టమని సజ్జల అభిప్రాయపడ్డారు.

టీడీపీ అధినేత చంద్రబాబుపైనా సజ్జల సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్లో వైఎస్ షర్మిల చేరిక వెనుక చంద్రబాబు కుట్ర ఉందని అన్నారు. ప్రజలు, కుటుంబం మధ్య తేల్చుకోవాల్సి వస్తే సీఎం జగన్.. జనాన్నే ఎంచుకుంటారని సజ్జల స్పష్టం చేశారు. రాజకీయాల్లో కుటుంబానికి ప్రాధాన్యత ఉండకూడదు అంటూనే మళ్ళీ ఈ వాదన ఎందుకు తెరపైకి తెస్తున్నారని ప్రశ్నించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరులు వైఎస్ వివేకానంద రెడ్డి తమకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన విషయాన్ని సజ్జల గుర్తు చేశారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి కుటుంబం కోసం పార్టీ పెట్టలేదన్న సజ్జల.. ప్రజా సంక్షేమమే పరమావధిగా జనం ఎరిగిన నేతగా ఆయన దూసుకుపోతున్నారని అన్నారు. ఎంత మంది వచ్చినా వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ క్లీన్‌స్విప్ చేయడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వీలైనంత ఎక్కువగా గెలుపు గుర్రాలను ఎంపిక చేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ప్రతి ఎన్నికల్లో టికెట్ ఇవ్వటమే కిరీటం కాదన్న సజ్జల.. నియోజకవర్గాల్లో మార్పులు అన్ని పార్టీల్లో సహజమేనని అన్నారు. పార్టీ ఇంఛార్జులు, ఎమ్మెల్యేలను మార్చిన చోట స్పందన బాగుందని సజ్జల స్పష్టం చేశారు.

Updated : 6 Jan 2024 12:38 PM GMT
Tags:    
Next Story
Share it
Top